తెలుగు ఆడియన్స్ అలాగే కన్నడ ఆడియన్స్ మనసు చాలా పెద్దది, వాళ్లకి మన వేరే అనే భేదం చాలా తక్కువ, అందుకే మంచి సినిమా అని తెలిస్తే చాలు అందులో మన వాళ్ళు ఉన్నారా లేరా అనేది కూడా చూడకుండా డబ్బింగ్ మూవీస్ ని చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు, ఆ అడ్వాంటేజ్ నే వాడుకుని చాలా మంది తమిళ్ యాక్టర్స్ తెలుగు లో అల్టిమేట్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు.
కానీ అదే సమయం లో మన సినిమాలను వాళ్ళు అదే రేంజ్ లో ఆడరిస్తున్నారా అంటే 100 లో 10% కూడా లేదు అనే చెప్పాలి, అడపదపా బాహుబలి, మగధీర, అరుందతి లాంటి సినిమాలు మాత్రమె అక్కడ ఆడగా మిగిలిన హీరోల సినిమాల్లో మహేష్ బాబు సినిమాలు మాత్రమె కొంచం బెటర్ గా అక్కడ కలెక్షన్స్ ని అందుకున్నాయి.
ఇక రీసెంట్ టైం లో అక్కడ డబ్/డైరెక్ట్ గా రిలీజ్ అయిన సినిమాలు సాహో మరియు సైరా లు రెండూ ఓ రేంజ్ లో డిసాస్టర్లు అయ్యాయి ఈ ఏరియాలలో… సాహో అంటే డిసాస్టర్ టాక్ ని తెచ్చుకుంది కాబట్టి అక్కడ కలెక్షన్స్ తెచ్చుకోలేక పోయింది అనుకున్నా…
సైరా మాత్రం ఏకంగా 3.5 యావరేజ్ రేటింగ్ తో ఓపెన్ అయినా 300 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక అక్కడ డిసాస్టర్ అయ్యింది.ఇక్కడ మరో విషయం ఏంటి అంటే అక్కడ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి ఇందులో కీలక రోల్ చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇక్కడ మనం మాత్రం వాళ్ళ సినిమాలకి టాక్ కి అతీతంగా కలెక్షన్స్ ని తెచ్చి పెడుతున్నాం.. ఈ ఇయర్ రిలీజ్ అయిన తమిళ్ సినిమాలు చాలా వరకు…
ఇక్కడ ప్రమోషన్స్ చేయక పోవడం వలన ఫ్లాఫ్ అవ్వగా యావరేజ్ ప్రమోషన్స్ చేసిన కాంచన 3 నెగటివ్ రివ్యూ లతో బ్లాక్ బస్టర్ అయింది, రిలీజ్ చేసి అసలు పట్టించుకోని టెంపర్ రీమేక్ అయోగ్య కి 75% బిజినెస్ రికవరీ అయింది. కానీ మన సినిమాలు అక్కడ ప్రమోషన్ చేసినా కానీ ఫ్లాఫ్స్ అవుతున్నాయి.. మొత్తం మీద వీళ్ళు వాళ్ళ హీరోల సినిమాలు తప్పితే వేరే హీరోల సినిమాలు ఆదరించారు అని సైరా రిజల్ట్ తేల్చిచెప్పింది.