బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున నటించిన రీసెంట్ ఎక్స్ పెరి మెంటల్ మూవీ వైల్డ్ డాగ్ కి సమ్మర్ టైం లో డిజిటల్ రిలీజ్ ఆఫర్స్ వచ్చినా నో చెప్పి ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో తీసుకు రాగా ఆడియన్స్ అనుకున్న రేంజ్ లో సినిమాను ఆదరించలేదు, దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది. 9.4 కోట్ల టార్గెట్ కి 3.53 కోట్ల షేర్ తో సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ డిసాస్టర్ అయినా కానీ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ వాళ్ళు 2.1 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్ మోస్ట్ 7 నెలల టైం తర్వాత రీసెంట్ గా ఫస్ట్ టైం టెలికాస్ట్ చేశారు.
కాగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో 4.7 TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది, ఇది మరీ తక్కువ రేటింగ్ కాదు అలా అని డీసెంట్ రేటింగ్ కాదు కానీ సినిమా జానర్ కి పర్వాలేదు అనిపించే రేటింగ్ అని చెప్పాలి. ఓవరాల్ గా 2.1 కోట్ల రేటు కి డీసెంట్ గానే సినిమా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా బాగా హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంది.