బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి ఏళ్ళు అవుతున్న మంచు విష్ణు లాస్ట్ ఇయర్ మోసగాళ్ళు తో మరో డిసాస్టర్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు కంప్లీట్ గా ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో చేసిన లేటెస్ట్ మూవీ జిన్నా తో దీపావళి రేసులో ఎంటర్ అయ్యాడు. ఈ సినిమా పై పెద్దగా బజ్ అయితే ఏమి క్రియేట్ కాలేదు కానీ ఒకవేళ రిలీజ్ అయ్యాక టాక్ పాజిటివ్ గా ఉంటే…
కచ్చితంగా పుంజుకునే అవకాశం ఉన్న సినిమాగా చెప్పుకోవాలి. ఇక సినిమా కి ఓవరాల్ గా పెద్దగా బిజినెస్ ఏమి జరగలేదు, చాలా ఏరియాలలో సినిమాను అడ్వాన్స్ బేస్ మీద ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా మొత్తం మీద సినిమా…
ట్రేడ్ లెక్కల్లో వర్త్ బిజినెస్ రేంజ్ తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 4 కోట్ల వరకు ఉంటుందని వరల్డ్ వైడ్ గా 4.50 కోట్ల వరకు వర్త్ బిజినెస్ ఉండవచ్చని అంచనా వేస్తూ ఉండగా ఈ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే…
వరల్డ్ వైడ్ గా 5 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పాలి. సినిమా కి ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ కనుక వస్తే ఈ మొత్తం రికవరీ చేయడం పోటీ ఉన్నా పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. మరి సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.