Home న్యూస్ 6వ రోజు కోటి పక్కా…మాస్ కుమ్ముడు కుమ్ముతున్న కాంతార!!

6వ రోజు కోటి పక్కా…మాస్ కుమ్ముడు కుమ్ముతున్న కాంతార!!

0

రిలీజ్ అయిన రోజు నుండి సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6వ రోజు మరో సారి వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కానీ మరోసారి మంచి హోల్డ్ తో పరుగును కొనసాగిస్తూ దుమ్ములేపుతుంది.

సినిమా 5వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 20% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి మంచి ట్రెండ్ నే చూపిస్తూ రన్ ని కొనసాగిస్తూ ఉండటంతో సినిమా ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….

Kantara Telugu 2 Days Collections!!

1.1 కోట్ల నుండి 1.2 కోట్ల దాకా షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తున్న ఈ సినిమా ఫైనల్ 6 డేస్ కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం కూడా ఉండగా ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు….

తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. సినిమా జోరు చూస్తూ ఉంటే 25 నుండి 30 కోట్ల గ్రాస్ ను అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పాలి. ఇక టోటల్ 6 డేస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here