Home న్యూస్ “ఏడు చేపల కథ” రివ్యూ….పారిపోండిరోయ్!!

“ఏడు చేపల కథ” రివ్యూ….పారిపోండిరోయ్!!

0

   రీసెంట్ టైం లో టాలీవుడ్ లో వచ్చిన అడల్ట్ కామెడీ టైప్ మూవీస్ లో భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా “ఏడు చేపల కథ”… టీసర్ రిలీజ్ అయిన తర్వాత ఎవ్వరూ ఊహించని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు భారీ డిలే తర్వాత నేడు ప్రేక్షకుల ముందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో 400 వరకు థియేటర్స్ లో భారీ గా రిలీజ్ అవ్వగా యూత్ మొత్తం థియేటర్స్ కి ఎగబడ్డారు.

ఇక సినిమా ఎలా ఉందో అన్న ఆసక్తి అందరిలోనూ ఉండగా కథ పాయింట్ టీసర్ ట్రైలర్ లో చూపెట్టినట్లే ఎక్స్ పోజింగ్ చేసే అమ్మాయిలను చూసి హీరో టెంప్ట్ అవుతాడు… తర్వాత ఆ అమ్మాయిలు తన ఇంటికి వస్తారు… ఇది ఒక పార్ట్ అయితే మరో కథ లో హీరో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు. కానీ తనకి సడెన్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది…

దానికి కారణం ఎవరు అని తెలుసుకునే పనిలో తను ఉంటుంది, సినిమా మెయిన్ పాయింట్ ఇదే. ఇక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే నిస్సందేహంగా నిరాశపరిచింది అని చెప్పాలి. మొదట కొంచం ఇంటరెస్టింగ్ గా కథ నడిచినా తర్వాత పూర్తిగా కథ అడ్డం తిరిగి ఏటో వెళ్లి పోతుంది.

సెకెండ్ ఆఫ్ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నా ఓవరాల్ గా సినిమా ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని టార్చర్ పెడుతుంది, ఇక టీసర్ ట్రైలర్ చూసి సినిమాలో ఇంకెన్ని వింతలూ ఉంటాయో అని వెళ్ళిన వాళ్లకి ఊహకందని షాక్ ఇస్తూ అన్ని సీన్స్ ని సెన్సార్ కట్ చేయడం తో ఆడియన్స్ మరింత నిరుత్సాహ పడటం ఖాయం. ఇక సంగీతం, ఎడిటింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్నీ చాలా నాసిరకంగా ఉన్నాయి.

సినిమా పై బయట నెలకొన్న హైప్ కి 10 మార్కులకు 3 కూడా సాధించలేకపోయింది సినిమా.. ఓవరాల్ గా టీసర్ ట్రైలర్ చూసి సినిమాకి వెళ్ళకూడదు అని నిరూపించే సినిమాల్లో ఈ “ఏడు చేపల కథ” కూడా ఒకటిగా నిలుస్తుంది.. సినిమా కి మా రేటింగ్ 1.5 స్టార్స్… యూత్ ఆడియన్స్ ని కొద్ది వరకు మెప్పించే చాన్స్ ఉండటం తో టాక్ ఎలా ఉన్నా వీకెండ్ కి సినిమా బ్రేక్ ఈవెన్ ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here