ప్రస్తుతం సెకెండ్ వేవ్ వలన అందరికీ పనులు ఇంట్లో నుండే చేసుకోవాల్సి వస్తుంది, ఇక స్టూడెంట్స్ అయితే సెలవులే కాబట్టి ఎక్కువ టైం సోషల్ మీడియా లోనే గడిపేస్తూ ఉంటున్నారు. దాంతో టైం తోచక అప్పుడప్పుడు ట్రోల్స్ కూడా చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఫ్యాన్ వార్స్ అనేవి చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి. కానీ అదేంటో ఈ మధ్య అవి కొన్ని సార్లు హద్దులు దాటి ఎక్స్ ట్రీంకి వెళుతున్నాయి.
ఇలా ఎక్కువగా కోలివుడ్ ఫ్యాన్స్ చేస్తూ ఉంటారు, అక్కడ విజయ్ అజిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లోనే ఒకరి మీద ఒకరు నేషనల్ వైడ్ గా వరల్డ్ వైడ్ గా అనేక సార్లు నెగటివ్ ట్రెండ్స్ ని చేశారు. అది మెల్లి మెల్లిగా టాలీవుడ్ కి కూడా ఇప్పుడు పాకింది.
అప్పుడప్పుడు మన ఫ్యాన్స్ కూడా గొడవలు జరిగిన టైం లో ఇతర హీరోల పై నెగటివ్ ట్రెండ్స్ ని నేషనల్ వైడ్ గా చేస్తున్నారు. రీసెంట్ టైం లో ఆర్ ఆర్ ఆర్ లో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ రామ్ చరణ్ లు వాళ్ళు కలిసే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా లో…
ఒకరి మీద ఒకరు దారుణమైన నెగటివ్ ట్రెండ్స్ ని చేశారు. అంతకుముందు కూడా మహేష్ బాబు అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా ఒక్కో సారి ఒక్కొక్కరు నెగటివ్ ట్రెండ్స్ ని నేషనల్ వైడ్ గా చేశారు. ఇదంతా ప్రజెంట్ టాప్ హిరోలకే పరిమితం సీనియర్స్ విషయం లో జరగదు అనుకుంటే… రీసెంట్ గా EVV గారి పుట్టిన రోజు…
టైం లో సోషల్ మీడియా లో హరీష్ శంకర్ మాటలో మాటగా హలో బ్రదర్ సినిమా చిరు కి పడి ఉంటే ఇంకా బాగా ఆడేది అంటూ కామెంట్స్ చేశారు. దాంతో ఆ కామెంట్స్ కి హార్ట్ అయిన అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చిరు పై ట్రోల్స్ చేయడం…
స్టార్ట్ చేశారు…. అది రెండు రోజులు అవుతున్నా సోషల్ మీడియా లో కంటిన్యూ గా కొనసాగడం, ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగి పోవడం చూసి సీనియర్స్ విషయం లో కూడా ఈ ఫ్యాన్ వార్స్ ఏంటి రా బాబు అని చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా లో టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా నెగటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు.
డౌట్ లో పడ్డ మెగాస్టార్ ఆచార్య రిలీజ్!!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ ఆచార్య. బాక్స్ ఆఫీస్ దగ్గర అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికే రిలీజ్ అయ్యి పరుగును పూర్తీ చేసుకోవాల్సిన ఈ సినిమా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు సెకెండ్ వేవ్ తర్వాత బాలెన్స్ షూటింగ్ ఉన్న నేపధ్యంలో సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. షూటింగ్ పూర్తీ చేసుకుని డైరెక్ట్ గా రిలీజ్ ను ప్రకటించడం లాంటివి జరిగే పనులు కావు కాబట్టి సినిమా కుదిరితే ఇప్పుడు దసరా టైం లో…
లేకపోతె వచ్చే సంక్రాంతి కి బరిలోకి దిగే అవకాశం ఎక్కువగా ఉందీ అంటూ లేటెస్ట్ గా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది, దీనికి మరో కారణం ఇప్పుడు సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు తర్వాత నెలల్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాల వల్ల క్లాష్ ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.