బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా ప్రిన్స్ వరుణ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ గాండీవ ధారి అర్జున(Gandeevadhari Arjuna) సినిమా మొదటి రోజు నుండే కలెక్షన్స్ పరంగా మినిమం హోల్డ్ ని కూడా చూపించలేక తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే…
కాగా సినిమా వీకెండ్ లో మొత్తం మీద 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా కేవలం 1.46 కోట్ల రేంజ్ లోనే షేర్ ని సాధించింది. ఇక సినిమా 4వ రోజు వర్కింగ్ డే లో అడుగు పెట్టి ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది.
అన్ని చోట్లా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకున్న సినిమా చాలా చిన్న స్టేషన్స్ లో తప్పితే అన్ని సెంటర్స్ లో కూడా ఆల్ మోస్ట్ జీరో షేర్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. వరుణ్ తేజ్ ప్రీవియస్ మూవీ గని కూడా…
ఇలానే వర్కింగ్ డేస్ లో మినిమం ఇంపాక్ట్ ని చూపించలేక తీవ్రంగా నిరాశ పరిచాయి. ఓవరాల్ గా ఇప్పుడు గాండీవ ధారి అర్జున సినిమా వరుణ్ తేజ్ కెరీర్ లో మరో బిగ్ డిసాస్టర్ మూవీ గా నిలవడం కన్ఫాం అయిపోగా బాక్ టు బాక్ ఎపిక్ డిసాస్టర్లు ఇప్పుడు…
వరుణ్ తేజ్ ఖాతాలో పడినట్లు అయింది. మొత్తం మీద సినిమా 4 రోజుల్లో 1.5 కోట్ల లోపు షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 16.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అసాధ్యమే కాబట్టి సినిమా భారీ నష్టాలతో పరుగును పూర్తి చేసుకోబోతుంది.