Home న్యూస్ జాంబి రెడ్డి రివ్యూ…కుమ్మింది…కానీ!

జాంబి రెడ్డి రివ్యూ…కుమ్మింది…కానీ!

0

టాలీవుడ్ లో వచ్చిన మొట్ట మొదటి జాంబి మూవీ జాంబి రెడ్డి, చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హీరోగా లాంచ్ అవుతూ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ ని ఎంచుకుని జాంబిల నేపధ్యంలో సినిమా చేయడం విశేషం. అః మరియు కల్కి సినిమాల దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా కమర్షియల్ హంగులను కూడా సొంతం చేసుకోగా ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. మరి ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ..

ముందుగా కథ పాయింట్ కి వస్తే… కరోనా ఎంటర్ అవ్వడం తో ప్రధాన మంత్రి ఇండియా మొత్తం లాక్ డౌన్ అమలు చేస్తారు, ఇక ఆ టైం లో ప్రేఫెశనల్ గేమింగ్ బ్యాచ్ అయిన హీరో అండ్ ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ మ్యారేజ్ సెట్ అవుతుంది, ఆ పెళ్లి కోసం కర్నూల్ కి బయలు దేరుతారు హీరో అండ్ ఫ్రెండ్స్…

అక్కడ ఊహించని పరిణామాల వాళ్ళ అందరూ జాంబిలుగా మారుతారు… ఇలాంటి టైం లో హీరో అండ్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఈ జాంబిల నుండి ఎలా భయటపడ్డారు, అసలు జాంబిలుగా ఎలా మారారు… లాంటి సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కథ పాయింట్ ట్రైలర్ లోనే చాలా వరకు రివీల్ చేశారు… ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరోగా ఫస్ట్ మూవీనే అయినా తేజ ఆకట్టుకున్నాడు, ఎక్కడా ఓవర్ చేయకుండా తన పాత్రకి తగ్గట్లు నటించి మెప్పించాగా హీరోయిన్స్ ఇద్దరూ మెప్పించారు. ఇక గెటప్ శీను కామెడీ హైలెట్ గా నిలిచింది… సెకెండ్ ఆఫ్ మొత్తాన్ని తన కామెడీ సీన్స్ తో ఓ రేంజ్ లో ఎలివేట్ చేశాడు శీను, ఇక సీనియర్ అన్నపూర్ణమ్మ గారు కూడా…

కామెడీ తో మెప్పించారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ పడుతూ లేస్తూ సాగినా సెకెండ్ ఆఫ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉంది, డైలాగ్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉండటం విశేషం… ఇక డైరక్షన్ విషయానికి వస్తే…

ప్రశాంత్ వర్మ సినిమా అసలు కథలో ఎంటర్ అవ్వడానికి ఈ సారి కొద్దిగా టైం తీసుకున్నాడు, దాంతో అంతకుముందు వచ్చిన సీన్స్ చాలా వరకు బోర్ కొట్టినట్లు అనిపించాయి, కానీ సెకెండ్ ఆఫ్ మళ్ళీ జోరు పెంచి కామెడీ సీన్స్ తో జాంబిలతో ఫైట్ సీన్స్ తో తన స్పెషాలిటీ చూపెట్టి మెప్పించాడు.

దాంతో క్లైమాక్స్ విషయంలో ఇంకా ఎక్కువ ఎక్స్ పెర్ట్ చేస్తే…సింపుల్ గా ముగించారు…. అది కొంచం ఓకే అనిపించినా ఓవరాల్ గా ఫస్టాఫ్ స్లో అయినా సెకెండ్ ఆఫ్ ఇచ్చిన కిక్ తో ఓ మంచి ఎంటర్ టైనర్ కం థ్రిల్లర్ ని చూశాం అనిపించడం ఖాయం.. సినిమా చూసి బయటికి వచ్చాక ఫస్టాఫ్ గురించి పెద్దగా పట్టించుకోమ్ కూడా…

అయినా ఫస్టాఫ్ ఇంకాస్త బెటర్ గా రాసుకుని ఉంటె సినిమా లెవల్ ఇంకా చాలా చాలా బెటర్ గా ఉండేది. మొత్తం మీద సినిమా అంచనాలను ఏమాత్రం తక్కువ చేయకుండా ఓవరాల్ మూవీ పరంగా బాగానే మెప్పించింది. అక్కడక్కడా కొన్ని చిన్న హికప్స్ ఉన్నప్పటికీ ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంది జాంబి రెడ్డి సినిమా..సో మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here