Home న్యూస్ ఇంత డిసాస్టర్ టాక్ తో 100 ఏంటి సామి….భీభత్సం ఇదీ!!

ఇంత డిసాస్టర్ టాక్ తో 100 ఏంటి సామి….భీభత్సం ఇదీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా కి ఫ్లాఫ్ టాక్ వస్తే ఆ సినిమా తేరుకోవడం ఇక కష్టమే అని చెప్పాలి, కానీ డిసాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ళని రాబట్టడం కొందరికీ చెల్లుతుంది… ఇప్పుడు ఇలాంటి రేర్ ఫీట్ నే మళ్ళీ సాధించాడు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్… తన లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ…

రీసెంట్ గా రంజాన్ కానుకగా ఆడియన్స్ ముందుకు రాగా సినిమా కి ఆడియన్స్ నుండి టాక్ కంప్లీట్ గా నెగటివ్ గా వచ్చింది, బాలీవుడ్ మీడియాని మ్యానేజ్ చేసి కొంచం పాజిటివ్ రివ్యూలు రాయించినా కూడా సోషల్ మీడియాలో మౌత్ టాక్ మాత్రం కంప్లీట్ గా…

నెగటివ్ గానే ఉంది ఈ సినిమాకి, దాంతో రంజాన్ పండగ వీకెండ్ లో ఎలాగోలా యావరేజ్ రేంజ్ వసూళ్ళని అందుకున్న సినిమా తర్వాత కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది. అయినా కూడా ఇప్పుడు 11వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఈ సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. సల్మాన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ ఎలా ఉన్నా కూడా మినిమమ్ వసూళ్లు ఈ రేంజ్ లో ఉంటాయి అన్న విషయాన్నీ మరోసారి రుజువు చేసింది ఈ సినిమా. కానీ ఓవరాల్ గా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గానే నిలిచింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here