కరోనా వల్ల పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలిసిందే, థియేటర్స్ ఓపెన్ చేయక 6 నెలలు అవుతుండగా సినిమా నిర్మాతలు ఎంతో కొంత నష్టాలతో కానీ లాభాలతో కానీ సినిమాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ తో పాటు శాటిలైట్ రైట్స్ ని అమ్ముకుంటూ సేఫ్ గానే ఉన్నా బయ్యర్లు థియేటర్స్ ఓనర్లు మాత్రం భారీ గా నష్టపోయిన పరిస్థితులు ఉండగా అదే సమయం లో ఇటు నిర్మాతల సైడ్ నుండి చూసు కుంటే….
ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు చేసి తీసే సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అయితే నిర్మాతల భాద ఊహాతీతంగా ఉంటుంది. ఇప్పుడు అదే భాద ని అనుభవిస్తున్నాడు బాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్. ఒక వైపు సుశాంత్ ఫ్యాన్స్ తో…..
ఎదురుదెబ్బ మరో వైపు లాస్ట్ ఇయర్ ఆయన నిర్మాణం లో వచ్చిన సినిమాల్లో 3 సినిమాలు అయ్యాయి. కేసరి, కలంక్ మరియు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాలు. ఇందులో కేసరి ఎలాగోలా బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక కలంక్ ని ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో తీయగా కేవలం 30 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టి డిసాస్టర్ అయ్యింది.
ఇక తర్వాత రిలీజ్ అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాను కూడా అదే రేంజ్ లో 80 కోట్ల బడ్జెట్ తో తీశాడట. సినిమా టోటల్ రన్ లో 25 కోట్ల షేర్ ని మాత్రమే అందుకోగా….ఈ రెండు సినిమాలను ఒకే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్స్ కి ఇవ్వగా వాళ్లకి తీవ్ర నష్టాలు వచ్చాయి… ఓవరాల్ గా ఈ రెండు సినిమాల పై…
భారీ ఆశలు పెట్టుకున్నా కానీ రెండు కలిపి ఏకంగా 100 కోట్ల నష్టాన్ని మిగిలించాయట. లాస్ట్ ఇయర్ నుండి బయ్యర్లు లాస్ లు తీర్చండి అంటూ అడిగినా తర్వాత చూద్దాం అన్న కరణ్ జోహార్ ఇప్పుడు పరిస్థితులు ఏమాత్రం బాలేవు కాబట్టి మమ్మల్ని ఆదుకోండి అంటూ వచ్చిన బయ్యర్లు థియేటర్ ఓనర్లకి ఏమి చెప్పడం లేదట… దాంతో ఇలా చేస్తే సినిమాలను బ్యాన్ చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారట.. మరి ఫైనల్ గా ఏమవతుందో చూడాలి మరి…