బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున మంచి విజయాన్ని అందుకుని చాలా టైం అవుతుంది, 2016 లో సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమాలతో బాక్ టు బాక్ హిట్స్ ని సొంతం చేసుకున్న నాగార్జున తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరుస్తూ వచ్చింది, ముఖ్యంగా రీసెంట్ గా చేసిన ఆఫీసర్ మరియు మన్మథుడు 2 సినిమాలు రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ డిసాస్టర్ మూవీస్ గా నిలిచాయి.
ఇలాంటి టైం లో తన అప్ కమింగ్ మూవీ కూడా ఎక్స్ పెరిమెంటల్ మూవీ నే కాగా వైల్డ్ డాగ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది, తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్న నాగార్జున వీటితో పాటు ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న….
ఓ సినిమా ను ఎలాగైనా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు, అదే హిందీ లో రెండున్నర ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అజయ్ దేవగన్ ఇలియానా ల కాంబినేషన్ లో తెరకెక్కిన రైడ్ సినిమా ను తెలుగు లో రీమేక్ చేయాలనీ భావిస్తున్నారు, ఎప్పుడో రైట్స్ కూడా తీసుకున్నా కానీ అనుకోకుండా ఈ సినిమా కి…
అడ్డంకులు వస్తుండగా ఇది పక్కకు పెట్టి ఆఫీసర్ అండ్ మన్మథుడు 2 సినిమాలు చేశాడు నాగ్, వైల్డ్ డాగ్ కూడా కంప్లీట్ అవ్వగా ఈ సినిమాను మొదలు పెట్టాలి అని ప్రవీణ్ సత్తారుని ఓకే చేసినా తను చెప్పిన కథ నచ్చడం తో ఈ రీమేక్ ప్లేస్ లో ఆ సినిమాను ఓకే చేశాడు నాగార్జున. దాంతో అప్పటి నుండి ఈ సినిమా కి డైరెక్టర్ ని వెతికే పనిలో ఉన్న నాగార్జున…
తర్వతలోనే డైరెక్టర్ ని కన్ఫాం చేసి సినిమాను తెలుగు లో కొన్ని మార్పులు చేర్పులతో హీరోయిజం అండ్ ఎలివేషన్ సీన్స్ ని పెంచి కమర్షియల్ మూవీగా మార్చాలి అని భావిస్తున్నారట. హిందీ లో 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించిన ఈ మూవీ నాగార్జున ఎప్పుడు పట్టాలు ఎక్కిస్తారో మరి చూడాల్సిందే…