Home Uncategorized శింభు సినిమా కి సెన్సేషనల్ రేటు…కొండతో ఢీ కొట్టనున్న హీరో!!

శింభు సినిమా కి సెన్సేషనల్ రేటు…కొండతో ఢీ కొట్టనున్న హీరో!!

1209
0

కోలివుడ్ లో మీడియం రేంజ్ హీరోలు చాలా మందే ఉన్నారు కానీ వాళ్ళలో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న వాళ్ళు కొందరే ఉన్నారు, అలాంటి వాళ్ళలో ఒకప్పుడు యూత్ ని బాగా ఆకట్టుకునే సినిమాలు చేసిన శింభు కూడా ఒకరు, ఈ మధ్య వరుస ఫ్లాఫ్స్ తో క్రేజ్ ని కోల్పోయినా కానీ శింభు కొత్త సినిమా పై కోలివుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. దానికి కారణం సినిమా లో శింభు న్యూ లుక్ అని చెప్పొచ్చు…

ఈ సినిమా కన్నా ముందు శింభు చేసిన అత్తారింటికి దారేది రీమేక్ తమిళ్ లో అట్టర్ డిసాస్టర్ అయ్యింది, శింభు పవన్ కళ్యాణ్ రోల్ ని చెడగొట్టేశాడని ట్రోల్స్ కూడా గట్టిగానే జరిగాయి, ఇక అప్పుడు మరీ లావుగా కూడా ఉండటం తో మరింత ఎక్కువ ట్రోల్స్ జరగగా అప్పటి నుండి సినిమాలకు దూరం అయిన శింభు…

కంప్లీట్ మేకోవర్ తో కొత్త సినిమాను కమిట్ అయ్యాడు, అదే ఈశ్వరన్ సినిమా, ఇదే సినిమా తెలుగు లో ఈశ్వరుడు పేరుతో రానుండగా సినిమా ఇప్పుడు సంక్రాంతి రేసులో నిలిచింది, తమిళ్ లో సినిమా కి మొత్తం మీద బిజినెస్ కూడా పూర్తీ అయినట్లు సమాచారం. టోటల్ తమిళనాడుకి గాను…

ఈ సినిమా కి 7.25 కోట్ల రేటు కి కొన్నారని సమాచారం…ప్రస్తుత పాండమిక్ పరిస్థితులలో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న హీరో సినిమా కి ఇలాంటి రేటు దక్కడం విశేషం అనే చెప్పాలి, అది కూడా బాక్స్ ఆఫీస్ మాన్స్టర్ అయిన దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మాస్టర్ కి పోటిగా ఇప్పుడు ఈ సినిమా కోలివుడ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. విజయ్ మాస్టర్ 13 న రిలీజ్ కానుండగా…

ఈశ్వరన్ సినిమా 14 న రిలీజ్ కానుందని సమాచారం. ఇక తెలుగు రిలీజ్ కొంచం లేట్ అయ్యే అవకాశం ఉండగా కోలివుడ్ లో మాస్త్రం కొండంత క్రేజ్ ఉన్న విజయ్ మాస్టర్ ని ఢీ కొట్టి ఈ సినిమా ఎంతవరకు నెట్టుకు వస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది, బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 14 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here