బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ ఇండస్ట్రీలో కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు అనేకం రిలీజ్ అయ్యాయి. బాహుబలి తర్వాత ఇలాంటి భారీ హంగులతో తెరకెక్కిన సినిమాలు అనేకం అన్ని ఇండస్ట్రీలలో వచ్చాయి కానీ కొన్ని మాత్రమే ఆడియన్స్ అంచనాలను అందుకోగలిగాయి కానీ చాలా సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేక బొక్క బోర్లా పడ్డాయి. లేటెస్ట్ గా మలయాళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కి రిలీజ్ కి ముందే…
లేట్ అవ్వడంతో నేషనల్ అవార్డులను కూడా ఈ ఇయర్ కి గ్రాఫిక్స్ లో సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కార్ అరేబియా సముద్ర సింహం సినిమా కి హైప్ సాలిడ్ గానే ఉన్నా కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి భారీ ఆఫర్స్ వచ్చినా కానీ…
వాటికీ నో చెప్పి సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు వచ్చాయి అంటూ కొత్త పబ్లిసిటీ చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత అంచనాలను అందుకోలేక చేతులు ఎత్తేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో కూడా అఖండ ఫ్లోలో ఈ సినిమాను…
ఎవ్వరూ పట్టించుకోలేదు… సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా టాక్ ఏమాత్రం ఆకట్టుకోలేదు, ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ లెక్క మొత్తం మీద 27 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అలాగే 14 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. కానీ అది కూడా మొత్తం మీద నెగటివ్ షేర్ కానీ డెఫిసిట్ లు కానీ…
తీయకుండా చెప్పిన కలెక్షన్స్ ఇవి…. అవి కూడా తీసేస్తే సినిమా సాధించిన షేర్ ఏమి ఉండదు అనే చెప్పాలి. మొత్తం మీద సినిమా అన్ని వర్షన్ లు కలిపి 43 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 100 కోట్లు అన్నారు కానీ ఇప్పటి వరకు సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఇది. తెలుగు లో అఖండ యుఫోరియాలో ఈ సినిమా కొట్టుకుపోయింది అనే చెప్పాలి.