Home న్యూస్ 100 కోట్ల లీడ్ తో సంక్రాంతి విన్నర్స్ గా చిరు-విజయ్!!

100 కోట్ల లీడ్ తో సంక్రాంతి విన్నర్స్ గా చిరు-విజయ్!!

0

2023 సంక్రాంతి సీజన్ ముగిసింది. టాలీవుడ్ నుండి 2 సీనియర్ హీరో సినిమాలు కోలివుడ్ నుండి 2 టాప్ హీరోల సినిమాలు పోటి పడగా పోటిలో తెలుగు లో వాల్తేరు వీరయ్య తమిళ్ లో వారిసు సినిమాలు విజేతలుగా నిలవగా ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన టోటల్ 4 పెద్ద సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్స్ గా నిలవడం విశేషం అనే చెప్పాలి. మొత్తం మీద రెండు ఇండస్ట్రీలలో 2 సినిమాలు ఇప్పుడు…

సంక్రాంతి విన్నర్స్ గా నిలవగా రెండు సినిమాలకు కూడా ఒక సిమిలారిటీ ఉంది ఇప్పుడు… రెండు సినిమాలు కూడా పోటి పడ్డ ఇతర సినిమా మీద ఆల్ మోస్ట్ 100 కోట్ల లీడ్ తో భారీ మార్జిన్ లో విక్టరీ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి….

వారిసు సినిమా 296 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంటే తునివు సినిమా 195 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోగా ఆల్ మోస్ట్ 101 కోట్ల రేంజ్ లో డిఫెరెన్స్ ఉంది. ఇక వాల్తేరు వీరయ్య ఈ వీకెండ్ లో వచ్చే లిమిటెడ్ కలెక్షన్స్ తో 234 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోబోతుండగా…

వీర సింహ రెడ్డి సినిమా 134 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోబోతుంది. ఆల్ మోస్ట్ ఇక్కడ కూడా 100 కోట్ల డిఫెరెన్స్ 2 సినిమాల మధ్య ఉండగా ఓవరాల్ గా అన్ని సినిమాలు విజయాలుగా నిలిచినా విన్నర్స్ గా మాత్రం వాల్తేరు వీరయ్య మరియు వారిసు సినిమాలు భారీ మార్జిన్ తో దుమ్ము లేపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here