బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా రణబీర్ కపూర్(Ranbir Kapoor) యానిమల్(Animal Movie)…. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో సాలిడ్ గా క్రేజ్ అండ్ బజ్ అయితే నెలకొంది…
ఆ బజ్ ఇప్పుడు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తూ ఉండగా సినిమా మొదటి రోజు బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందీ అనిపించేలా జోరు చూపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండగా…
ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా 25 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా హిందీ తో పాటు తెలుగు లో కూడా బుకింగ్స్ ట్రెండ్ ఎక్స్ లెంట్ గా ఉంది, ఓవరాల్ గా ట్రేడ్ వర్గాలు సినిమా మొదటి రోజున ఇండియాలో అవలీలగా 56-60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సినిమా…
సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా 35-40 కోట్ల మధ్యలో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దాంతో సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ లెక్క 100 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెబుతూ ఉండటం విశేషం.
సినిమా ఈ మార్క్ ని అందుకున్నా మించిపోయినా అది ఊహకందని ఊచకోత అనే చెప్పాలి. రణబీర్ కపూర్ కెరీర్ లో ఆల్ టైం మమ్మోత్ ఓపెనింగ్స్ ను సినిమా మొదటి రోజున సొంతం చేసుకోవడానికి సిద్ధం అవుతుంది, మరి ఆ ఓపెనింగ్స్ లెక్క ఈ రేంజ్ లోనే ఉంటుందా లేక ఇంతకి మించి ఉంటుందో చూడాలి ఇక.