Home న్యూస్ రెండు రాష్ట్రాలలో 105 కోట్లు… ఎన్టీఆర్ కెరీర్ లో నంబర్ 1

రెండు రాష్ట్రాలలో 105 కోట్లు… ఎన్టీఆర్ కెరీర్ లో నంబర్ 1

2

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాలలో మొత్తం మీద 95.1 కోట్ల షేర్ ని 15 రోజుల్లో 95.37 కోట్ల షేర్ ని అందుకోగా అందులో రెండు తెలుగు రాష్ట్రాలలోనే ఏకంగా 71.05 కోట్ల షేర్ ని అందుకుంది. సినిమాను మొత్తం మీద 67 కోట్లకు అమ్మితే 71 కోట్ల కు పైగా షేర్ తో ఓవరాల్ గా 4 కోట్ల ప్రాఫిట్స్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా మొత్తం మీద ఎన్టీఆర్ కెరీర్ లో రెండు రాష్ట్రాలలో మొదటి 70 కోట్ల షేర్ సినిమాగా రెండు రాష్ట్రాలలో మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీ గాను నిలిచింది. ఇక 15 రోజుల్లో అరవింద సమేత రెండు రాష్ట్రాలలో 71.05 కోట్ల షేర్ ను మరియు టోటల్ గా 105 కోట్ల గ్రాస్ ని అందుకుందని సమాచారం.

దాంతో రెండు రాష్ట్రాలలో 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న అతికొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచింది. లాంగ్ రన్ లో మరింత జోరు చూపుతుంది అనుకున్నా స్లో డౌన్ అయిన ఈ సినిమా టోటల్ గా ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here