Home న్యూస్ బాహుబలి ని లేపితేనే అక్కడ సర్కార్ హిట్…

బాహుబలి ని లేపితేనే అక్కడ సర్కార్ హిట్…

0

  కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ అత్యంత భారీ ఎత్తున ఈ ధీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తమిళ్ మరియి తెలుగు భాషల్లో ఏక కాలం లో రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. మెర్సల్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటాయి అని చెప్పాలి. కాగా సినిమా బిజినెస్ పరంగా అన్నీ ఏరియాల్లో రికార్డులు నమోదు చేస్తుంది.

తమిళనాడు లో ఓవరాల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా మెర్సల్ 70 కోట్ల బిజినెస్ చేసి టోటల్ రన్ లో 71 కోట్ల షేర్ ని అందుకోగా అక్కడ బాహుబలి 2 అన్నీ తమిళ్ మూవీస్ ని క్రాస్ చేసి ఏకంగా 79 కోట్ల షేర్ ని అందుకుంది. రజినీ విజయ్ లాంటి స్టార్స్ కూడా అందనంత రేంజ్ అది.

అలాంటిది విజయ్ సర్కార్ సినిమా తమిళ్ బిజినెస్సే ఏకంగా 80 కోట్ల రేంజ్ లో జరుగుతుందట. అంటే సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఏకంగా బాహుబలి ని క్రాస్ చేస్తేనే హిట్ అవుతుంది. సినిమా పై క్రేజ్ కూడా చుక్కల్లో ఉండటంతో సినిమా హిట్ టాక్ వస్తే దుమ్ము లేపే కలెక్షన్స్ ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here