Home న్యూస్ 10th క్లాస్ డైరీస్ రివ్యూ…!!

10th క్లాస్ డైరీస్ రివ్యూ…!!

0

ఆల్ మోస్ట్ రెండు దశాబ్దాల క్రితం ఒకరికి ఒకరు లాంటి సినిమాతో హిట్ అందుకున్న శ్రీకాంత్ అడపాదడపా తెలుగు మూవీస్ ని చేస్తూనే ఉండగా సరైన సక్సెస్ అయితే సొంతం అవ్వలేదు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు రీసెంట్ గా 10th క్లాస్ డైరీస్ అంటూ సెన్సిబుల్ మూవీతో తన లక్ ని పరీక్షించుకోబోతున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

అమెరికాలో సెటిల్ అయిన హీరో పేరుకు డబ్బు, విలాస వంతమైన జీవితం ఉన్నప్పటికీ లైఫ్ లో సంతోషాన్ని మిస్ అవుతాడు, ఈ లోపు తన భార్య నుండి కూడా విదిపోతాడు, తన సంతోషాన్ని వెతుకుతూ తన 10th క్లాస్ రీ యూనియన్ ని ప్లాన్ చేస్తాడు…తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ…

కథ పరంగా స్లోగా స్టార్ట్ అయ్యి కొన్ని అక్కడక్కడా ఆకట్టుకునే సీన్స్ పడినా కానీ ఎక్కువ శాతం కథ  నెమ్సామదిగా గడం, సీన్స్ కూడా ఆల్ రెడీ ఇది వరకే చూసినట్లు అనిపించడం మైనస్ అయినా కానీ ఎంటర్ టైన్ మెంట్ కొద్ది వరకు ఆకట్టుకోవడం సెకెండ్ ఆఫ్ లో హీరోయిన్ అవికా గోర్ కోసం వెతికే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి…వెన్నెల రామారావు కామెడీ ఆకట్టుకోవడం పాయింట్ అని చెప్పాలి.

లవ్ చేసిన వ్యక్తీ నిర్లక్షం, అలాగే ఎక్కువగా ప్రేమించే నాన్న వలన ఓ అమ్మాయి లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసింది అన్న రియలస్టిక్ స్టొరీతో తెరకెక్కిన ఈ సినిమా ఆ పాయింట్ వరకు మెప్పించింది, తర్వాత స్కూల్ డేస్ ని తిరిగి గుర్తు చేసి ఆకట్టుకుంది, ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యేలా ఉన్న సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మెప్పించడం విశేషం….

మ్యూజిక్ పర్వాలేదు అనిపించే విధంగా ఉండటం, ఓవరాల్ గా సినిమాలో ఫ్లాస్ ఉన్నప్పటికీ, కథని ఆల్ రెడీ చూసినట్లు అనిపించినప్పటికీ కూడా పాత జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసేలా ఉన్న సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ముగుస్తుంది…. సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్… ఇలాంటి సెన్సిబుల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా నచ్చే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here