నట సింహం నందమూరి బాలకృష్ణ హాట్రిక్ విజయాల తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఊరమాస్ జాతర వలన స్లో డౌన్ అయింది…చాలా వరకు రికవరీని ముందే సొంతం చేసుకున్నా కూడా బ్రేక్ ఈవెన్ కోసం మరికొంత కష్టపడాల్సిన అవసరం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి..
ఇక సినిమా 9వ రోజు నుండి వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా 9వ రోజు డీసెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా 10వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు ఒక్కో అడుగు ముందుకు వేస్తుంది..
సినిమా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజున 60-65 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి….ఇక వరల్డ్ వైడ్ గా సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు… మొత్తం మీద సినిమా ఉన్నంతలో బాగానే హోల్డ్ ని చూపెడుతున్నా కూడా…
సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీగానే ఎదురుదెబ్బ తీసింది అని చెప్పాలి…మొదటి 2-3 రోజుల్లో డాకు మహారాజ్ హోల్డ్ చూసి అందరూ 100 కోట్ల షేర్ మార్క్ కొడుతుందేమో అనుకున్నారు కానీ తర్వాత పరిస్థితులు మారి ఇప్పుడు క్లీన్ హిట్ అయ్యి మైనర్ ప్రాఫిట్స్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి…