బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించకపోవడంతో మళ్ళీ దీపావళి మూవీస్ అయిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలు…
ఇప్పుడు 10వ రోజున అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరుని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…ఇక క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు మంచి జోరుని చూపెడుతూ ఉండగా 9వ రోజుతో పోల్చితే మంచి గ్రోత్ ని చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 75-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 90 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.1 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక లక్కీ భాస్కర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజున రెట్టించిన జోరు చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కేరళలో తమిళనాడులో మాస్ రచ్చ చేస్తున్న సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా…
7-7.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక అమరన్ మూవీ బాక్స్ ఆఫీస్ అన్ని చోట్లా మాస్ ఊచకోత కోస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు ఓవరాల్ గా 1.2-1.4 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా, తమిళ్ లో సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15-16 కోట్ల రేంజ్ కి తగ్గని గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా అన్ని సినిమాల 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.