Home Uncategorized కల్కి@10th డే కలెక్షన్స్….మళ్ళీ కుమ్ముడు మొదలెట్టిన రెబలోడు!

కల్కి@10th డే కలెక్షన్స్….మళ్ళీ కుమ్ముడు మొదలెట్టిన రెబలోడు!

0

మొదటి వారంలో సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి(Kalki 2898 AD Movie) 9వ రోజు టికెట్ హైక్స్ తగ్గడం వలన కలెక్షన్స్ లో కొంచం డ్రాప్స్ కనిపించినా కూడా ఓవరాల్ గా మరోసారి బాగానే హోల్డ్ చేసింది. ఇక 10వ రోజు శనివారం అడ్వాంటేజ్ లభించడంతో సినిమా…

అన్ని చోట్లా మంచి జోరుని చూపిస్తూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజుతో పోల్చితే 10వ రోజు 30-35% రేంజ్ లో గ్రోత్ కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ జోరు కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….

దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 10వ రోజున ఇప్పుడు 5-5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక హిందీలో సినిమా ఈ రోజున…

మంచి జోరు చూపిస్తూ ఉండగా ఈవినింగ్ నైట్ షోల బుకింగ్స్ చూస్తూ ఉంటే 16-17 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం మించిపోయే ఛాన్స్ ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు కేరళ ఏరియాల్లో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…

4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా టోటల్ గా ఇండియాలో సినిమా ఈ రోజున 17-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు 21 కోట్లకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా హిందీలో సినిమా ఇప్పుడు మేజర్ లీడ్ ను సొంతం చేసుకోవడంతో లాంగ్ రన్ లో సినిమా స్టడీగా దుమ్ము లేపే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 10 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here