Home న్యూస్ ప్రపంచాన్ని ఏలిన కల్కికి….ఇక్కడ మాత్రం దెబ్బ పడింది సామి!!

ప్రపంచాన్ని ఏలిన కల్కికి….ఇక్కడ మాత్రం దెబ్బ పడింది సామి!!

0

రిలీజ్ అయిన రోజు నుండి కూడా అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ హిందీలో, ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది. ఓవర్సీస్ లో అయితే రికార్డులతో ఊచకోత కోసింది….

ఇక హిందీలో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే అల్టిమేట్ పాజిటివ్ టాక్ తో రచ్చ లేపింది. ఇక కర్ణాటకలో అంచనాలకు తగ్గట్లే దుమ్ము లేపిన సినిమా తమిళ్ అలాగే కేరళలో రిలీజ్ కి ముందు బజ్ లేక పోయినా కూడా పాజిటివ్ టాక్ పవర్ తో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రచ్చ చేసింది…

ఇలా రిలీజ్ అయిన అన్ని చోట్లా అంచనాలకు మించి జోరు చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ ని అందుకోగా ఇక్కడ కూడా నైజాం ఏరియాలో సాధించిన కలెక్షన్ మరో ఎత్తు అని చెప్పాలి. 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకున్న సినిమా….

   

తెలుగు రాష్ట్రాల్లో 168 కోట్ల వాల్యూ బిజినెస్ లో 146 కోట్లకు పైగా రికవరీ చేయగా అందులో సగం రికవరీని ఒక్క నైజాంలోనే అందుకుని బ్రేక్ ఈవెన్ ని దాటేసింది. ఇకా 22 కోట్లకు పైగా వాల్యూ షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా ఒక్క సీడెడ్ లోనే ఇంకా 10 కోట్లకు పైగా రికవరీని అందుకోవాల్సి ఉండగా…

ఆంధ్ర రీజన్ లో మిగిలిన మొత్తం రికవరీ చేయాల్సిన అవసరం ఉంది, రాయలసీమ లాంటి మాస్ ఏరియాలో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ బాగానే ఉన్నా కూడా అడ్వాన్స్ బేస్ మీద 27 కోట్ల రేటు బిజినెస్ జరగగా ఇప్పటి వరకు 16.68 కోట్లు మాత్రమే రికవరీ అయ్యింది…

దాంతో ప్రపంచం అంతా దుమ్ము లేపిన కల్కి కి ఇప్పుడు సీడెడ్ అండ్ ఆంధ్ర ఏరియాల్లో లాస్ లు వచ్చేలా ఉన్నాయి. అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ అవ్వడంతో మేకర్స్ ఈ ఏరియాల్లో డబ్బులు వెనక్కి ఇవ్వాల్సి వచ్చేలా ఉంది ఇప్పుడు. మరి లాంగ్ రన్ లో సినిమా ఈ ఏరియాల్లో ఎంతవరకు రికవరీని సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here