బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి వీకెండ్ లో రిలీజ్ అయిన సార్ మరియు వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని రెండో వారంలో ఎంటర్ అవ్వగా రెండు సినిమాలు ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోగా సార్ మూవీ మాత్రం ఊహకందని ప్రాఫిట్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉంది. ఇక వినరో భాగ్యము విష్ణు కథ సినిమా…
ఎట్టకేలకు 8 వ రోజు కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ ని అందుకోగా 9వ రోజు సండే అడ్వాంటేజ్ ఉండగా ఆల్ మోస్ట్ 8వ రోజుకి సిమిలర్ గానే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెర్ఫార్మ్ చేస్తుంది. దాంతో సినిమా ఆల్ మోస్ట్ 30 లక్షల రేంజ్ లో షేర్ ని….
ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ధనుష్ సార్ మాత్రం మరోసారి గ్రోత్ ని చూపించి దుమ్ము లేపుతూ ఉండగా ఆల్ మోస్ట్ 15% రేంజ్ లో అయితే గ్రోత్ ఉందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. దాంతో సినిమా ఈ రోజు….
తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి నుండి 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు, అంతకన్నా ఎక్కువ వస్తే సినిమా రిమార్కబుల్ గా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు. మొత్తం మీద అన్ సీజన్ లో 2 సినిమాలు వేటి రేంజ్ లో అవి దుమ్ము లేపుతున్నాయి. ఇక లాంగ్ రన్ లో ఇంకా ఎంతవరకు హోల్డ్ చేస్తాయో చూడాలి.