Home న్యూస్ 11 ఏళ్లలో ఇది 2 వ సారి మాత్రమే ఇలా జరిగింది!!

11 ఏళ్లలో ఇది 2 వ సారి మాత్రమే ఇలా జరిగింది!!

0

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రీసెంట్ టైం లో అను కున్న రేంజ్ ఫామ్ లో లేడు, అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సల్మాన్ నటించిన సినిమాలు అన్నీ అద్బుతమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసు కుంటూనే ఉన్నాయి.. డానికి కారణం సల్మాన్ ఖాన్ స్టార్ డం… కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఒకెత్తు అయితే 2009 నుండి సల్మాన్ ఖాన్ స్టార్ డం మరో ఎత్తు అని చెప్పొచ్చు.

2009 రంజాన్ టైం లో రిలీజ్ పోకిరి రీమేక్ వాంటెడ్ తో సూపర్ హిట్ కొట్టి అక్కడ రంజాన్ సీజన్ ని బ్యాడ్ గా భావించే వారికి షాక్ ఇస్తూ కొత్త మార్కెట్ ని సొంతం చేసుకున్న సల్మాన్ ఖాన్, ప్రతీ ఇయర్ రంజాన్ కి తన సినిమా కంప్లసరీ గా ఉండేలా చూసుకుంటూ వచ్చాడు.

ప్రతీ ఇయర్ రంజాన్ కి సల్మాన్ సినిమా చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యే రేంజ్ లో అలవాటు చేశాడు సల్మాన్ ఖాన్. నేడు రంజాన్ కానీ థియేటర్స్ లో అసలు సినిమాలే లేవు, దాంతో రంజాన్- సల్మాన్ సినిమాలు అనుకునే వారు ఈ రంజాన్ కి నిరాశపడక తప్పదు.

2009 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ప్రతీ రంజాన్ కి సినిమాలు రిలీజ్ చేసిన సల్మాన్ ఈ ఇయర్ కూడా కలుపుకుంటే కేవలం 2 సార్లు మాత్రమె రంజాన్ ని మిస్ అయ్యాడు, 2013 లో షారుఖ్ చెన్నై ఎక్స్ ప్రెస్ తో రాగా… మిగలిన అన్ని రంజాన్ లకు సల్మాన్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

వాంటెడ్, దబాంగ్, బాడీగార్డ్, టైగర్ జిందా హై తర్వత బ్రేక్ రాగా తిరిగి కిక్, భజరంగీ భాయిజాన్, సుల్తాన్, ట్యూబ్ లైట్, రేస్ 3 మరియు లాస్ట్ ఇయర్ భారత్ సినిమాలు రిలీజ్ చేశాడు, ఈ ఇయర్ కూడా రాదే సినిమా కన్ఫాం అయినా లాక్ డౌన్ వలన మిస్ అయింది. దాంతో ఈ ఇయర్ రంజాన్ కి సల్మాన్ సినిమా మిస్ అయినా లాక్ డౌన్ తర్వాత రాదే థియేటర్స్ కి రానుండటం తో ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here