పటాస్ తర్వాత మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురు చూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో పటాస్ తర్వాత వచ్చిన సినిమాల్లో బెస్ట్ టాక్ అండ్ రివ్యూ లను సొంతం చేసుకున్న సినిమా 118. బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు క్రేజ్ పెద్దగా లేక పోవడం, అన్ సీజన్ అవ్వడం తో తొలి మూడు షోల కి కొద్దిగా ఎఫెక్ట్ పడినా కానీ సినిమా డే ఎండ్ లో పుంజుకుని సత్తా చాటు కుంది.
ఇక సినిమా రెండో రోజు తొలి రెండు షోల కి మొదటి రోజు మొత్తం మీద పోల్చుకుంటే కేవలం 30% వరకు మాత్రమె డ్రాప్స్ ని సొంతం చేసుకోగా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి మంచి గ్రోత్ ని సాధించింది, అన్ సీజన్ అయినా కానీ వీకెండ్ అడ్వాంటేజ్ అండ్ పాజిటివ్….
టాక్ పవర్ తో సినిమా జోరు చూపుతూ దూసుకు పోతుంది, రెండో రోజు తొలి రెండు షోల ఆక్యుపెన్సీ ని చూసి సినిమా కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ బాగుండటం తో సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఇప్పుడు 1.2 కోట్ల కి పైగా నే షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ఇంకా బాగుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం ఉంది, మొత్తం మీద సినిమా ఇదే జోరు వీకెండ్ మొత్తం కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉండటం తో బిజినెస్ లో చాలా వరకు…
వీకెండ్ లోనే రికవరీ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు, వర్కింగ్ డేస్ లో సినిమా మినిమమ్ హోల్డ్ చేసినా లాంగ్ రన్ కన్ఫాం అని చెప్పొచ్చు. మరి రెండో రోజు సినిమా అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.