అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part1 11th Day Box Office Collections)….సండే దుమ్ము లేపిన తర్వాత 11వ రోజు వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా, దసరా సెలవులు మొదలు అవ్వడంతో వర్కింగ్ డే లో…
ఉండాల్సిన డ్రాప్స్ కన్నా కూడా బెటర్ గా హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది, దానికి తోడు మేజర్ ఏరియాల్లో సినిమా కి టికెట్ హైక్స్ ను కూడా తగ్గించడంతో ఆక్యుపెన్సీ బాగా పెరిగింది. ఆల్ మోస్ట్ సినిమా 7వ రోజు లెవల్ లో హోల్డ్ ని చూపెడుతూ ఉండగా…
ఆఫ్ లైన్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా బాగానే ఉండే అవకాశం ఉండగా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు అటూ ఇటూగా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 2.2-2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…
అంతకుమించి వస్తే మట్టుకు ఇక సినిమా వీక్ మొత్తం వీర విహారం చేసే ఛాన్స్ ఎంతైనా ఉంటుంది…ఇక హిందీలో ఈ రోజు ఆల్ మోస్ట్ 1.7-2 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు…..
ఓవర్సీస్ లు కలిపి ఓవరాల్ గా 55-60 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. దాంతో 11వ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 3.6-3.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4 కోట్లు ఆ పైన…
షేర్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా నార్మల్ గా సండే టు మండే తో పోల్చితే ఉండాల్సిన డ్రాప్స్ కన్నా కూడా దేవర చాలా బెటర్ గానే హోల్డ్ ని చూపెడుతూ ఉంది. ఇక మొత్తం మీద సినిమా 11వ రోజు ఈ అంచనాలను మించిపోతుందో లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.