కరోనా ఎఫెక్ట్ తో జనాలు ఇంట్లో నే ఉండగా థియేటర్స్ మూసేసి నెలలు గడుస్తున్నా ఎప్పుడు తెరుస్తారు, తెరిచినా జనాలు థియేటర్స్ కి వెళతారా లేదా అన్నది ఏమాత్రం క్లారిటీ లేకుండా పోయింది, ఇలాంటి టైం లో అన్ని సినిమాలకు కూడా డిజిటల్ రిలీజ్ లే దిక్కు గా మారగా… బాలీవుడ్ నుండి సౌత్ మూవీస్ అన్నీ కూడా మంచి రేట్లు దక్కిన వెంటనే డిజిటల్ రిలీజ్ చేయడానికి సిద్ధం అవ్వడం మనం చూస్తూనే ఉన్నామ్..
ఇక ఇలా డిజిటల్ రిలీజ్ అయినా అవుతున్న సినిమాల్లో ఇండియా లో హైయెస్ట్ రేటు సొంతం చేసుకున్న సినిమా అక్షయ్ కుమార్ నటిస్తున్న లక్ష్మీ బాంబ్ సినిమా అని చెప్పాలి, కాంచన సినిమా కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్…
ఏకంగా 125 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా…. సినిమా ఇప్పుడు నవంబర్ 9 న డైరెక్ట్ రిలీజ్ కాబోతుంది, అదే సమయం లో సినిమా థియేటర్స్ లో కూడా రిలీజ్ కాబోతుంది. కానీ అది ఇండియా లో కాదు, ఇండియా అవతల కొన్ని దేశాల్లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది…
వాటిలో ఇప్పటి కి కన్ఫాం అయిన దేశాలు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు UAE కాగా రిలీజ్ సమయానికి పరిస్థితులను బట్టి మరిన్ని దేశాలు యాడ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక ఇండియా లో సినిమా డైరెక్ట్ డిజిటల్ కానుండగా ఆ టైం కి మొత్తం మీద ఇండియా తరపున…. ఈ ఏడాది కరోనా ఎంటర్ అయిన తర్వాత….
8 నెలలకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మొదటి డైరెక్ట్ కొత్త సినిమా గా నిలవబోతుంది ఈ సినిమా, అది కూడా అంత రేటు పెట్టి కొన్న తర్వాత కూడా రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమా అవ్వడం, అందునా ఇలా డిజిటల్ రిలీజ్ అండ్ థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నా సినిమా కూడా ఇదే అవ్వడం విశేషం అనే చెప్పాలి…