బాక్స్ ఆఫీస్ దగ్గర 9 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక 8 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న హర్షవర్దన్ రానే హీరో గా హిందీలో చేసిన సనం తేరీ కసం(Sanam Teri Kasam) మూవీ అప్పుడు నిరాశ పరిచినా కూడా…
తర్వాత టైంలో డిజిటల్ లో టెలివిజన్ లో యూత్ ని ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేసి మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ ముందుకు రిలీజ్ అయిన 9 ఏళ్లకి రీసెంట్ గా సినిమా రీ రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి సినిమా కి ఊహకందని రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న…
ఈ సినిమా రీ రిలీజ్ లో సాలిడ్ రికార్డులను క్రియేట్ చేస్తూ మంచి లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ వర్కింగ్ డేస్ లో 50-60 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ ఇప్పుడు…
12 రోజుల్లో ఓవరాల్ గా 32 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….రిలీజ్ అయినప్పుడు 8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా రీ రిలీజ్ లో మాత్రం ఏకంగా 4 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
ఓవరాల్ గా ఇప్పుడు సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సినిమా ఓవరాల్ గా ఫస్ట్ టైం అండ్ ఇప్పుడు కలెక్షన్స్ కలిపి 40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని వీర లెవల్ లో కుమ్మేసి 9 ఏళ్లకి సినిమా రిజల్ట్ మారి ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది.