Home న్యూస్ 30L కూడా రాదన్నారు….70 వచ్చింది…ఇప్పుడు….20 వేల థియేటర్స్ లో రిలీజ్!!

30L కూడా రాదన్నారు….70 వచ్చింది…ఇప్పుడు….20 వేల థియేటర్స్ లో రిలీజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ కొన్ని అండర్ రేటెడ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో అసలు మేకర్స్ కి కూడా నమ్మకం తక్కువగా ఉండి రిలీజ్ అయిన మూవీస్ లో 12th ఫెయిల్(12th Fail Movie) ఒకటి అని చెప్పాలి. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ లాంటి ఎపిక్ మూవీస్ ని నిర్మించిన విదు వినోద్ చోప్రా డైరెక్షన్ లో వచ్చిన…

ఈ సినిమా రిలీజ్ కి ముందు ఆయన వైఫ్ చూసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తే 30 లక్షలు కూడా రావని చెప్పిందట. కానీ థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత చాలా స్లో కలెక్షన్స్ తోనే సాలిడ్ లాంగ్ రన్ ని అందుకుని ఏకంగా 100 రోజులకు పైగా థియేటర్స్ లో రన్ అయిన ఈ సినిమా ఇండియాలో టోటల్ రన్ లో 56 కోట్లకు పైగా…

నెట్ కలెక్షన్స్ ని సాధించి వరల్డ్ వైడ్ గా 70 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది… తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత ప్రతీ ఒక్కరి చేత శెభాష్ అనిపించుకుంటూ సెన్సేషనల్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 20 వేల థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది…

ఈ సినిమాను ఇప్పుడు గ్రాండ్ గా చైనాలో రిలీజ్ చేయబోతున్నారు. ఇండియన్ మార్కెట్ తో పోల్చితే చాలా పెద్ద మార్కెట్ అయిన చైనాలో ఏదైనా సినిమా క్లిక్ అయితే కలెక్షన్స్ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రికార్డ్ లెవల్ లో ఓ చిన్న సినిమా 20 వేల థియేటర్స్ లో త్వరలో అక్కడ రిలీజ్ కానుంది…

సినిమా ఇది వరకు అక్కడ రిలీజ్ అయిన దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్, భజరంగి భాయిజాన్ లాంటి సినిమాల మాదిరిగా టాక్ ను సొంతం చేసుకుంటే ఇక్కడ వచ్చిన వసూళ్ళకి ఎన్నో రెట్లు ఎక్కువ వసూళ్ళని అక్కడ దక్కించుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా కి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here