బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ నార్మల్ టైం లో రిలీజ్ అయ్యి ఉంటే టైర్ 2 హీరోల్లో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ రికార్డులను సెట్ చేసే సత్తా ఉన్న సినిమా నే అయినా పరిస్థితుల వలన ఆగి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా ఆంధ్రలో 50% ఆక్యుపెన్సీ లో టికెట్ రేట్ల వలన…
ఇబ్బందులను ఎదురుకున్న ఈ సినిమా షోలు 100% ఆక్యుపెన్సీతో వాడుకున్నా కలెక్షన్స్ మాత్రం 50% ఆక్యుపెన్సీవె రిపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు సినిమా ఆంధ్ర రీజన్ లో సాధించిన బిజినెస్ కి వచ్చిన కలెక్షన్స్ చూస్తె గట్టి ఎదురుదెబ్బ తగలడమే కాదు నష్టాలు కూడా సొంతం అయ్యాయి సినిమాకి…
టోటల్ ఆంధ్ర రీజన్ లో ఒక్కో ఏరియా బిజినెస్ అండ్ కలెక్షన్స్ ని గమనిస్తే… వైజాగ్ ఏరియాలో 3.25 కోట్ల బిజినెస్ అయితే 3.15 కోట్ల షేర్ ని రాబట్టింది… ఈస్ట్ ఏరియాలో 2.4 కోట్ల బిజినెస్ కి 1.74 కోట్లు, వెస్ట్ ఏరియాకి 2 కోట్లకి 1.48 కోట్లు, గుంటూరు ఏరియాకి 2.5 కోట్లకి 1.59 కోట్ల షేర్ ని…
కృష్ణా కి 1.8 కోట్ల బిజినెస్ కి 1.5 కోట్ల షేర్ మరియు నెల్లూర్ ఏరియాలో 1.2 కోట్ల కి 94 లక్షల షేర్ ని అందుకుని అన్ని ఏరియాల్లో 50% రిపోర్ట్ చేసిన కలెక్షన్స్ దృశ్యా నష్టాలను సొంతం చేసుకుంది.. ఓవరాల్ గా 13.15 కోట్ల బిజినెస్ కి సినిమా 10.40 కోట్లు మాత్రమే రికవరీ చేసింది… దాంతో సినిమా కి ఆంధ్ర రీజన్ లో 2.75 కోట్ల నష్టం వచ్చినట్లు అయింది…..
ఇవి బయటికి చెప్పిన లెక్కలు, బయటికి చెప్పని లెక్కల ప్రకారం ఇక్కడ లాభాలు సొంతం అయ్యాయి బయ్యర్స్ కి…. కానీ 50% ఆక్యుపెన్సీవె రిపోర్ట్ చేయడంతో ఓవరాల్ గా ఇక్కడ నష్టాలు వచ్చాయి…. కానీ ఒక సినిమా హిట్ ఫ్లాఫ్ ఆ సినిమా టోటల్ బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ని బట్టే ఉంటుంది కాబట్టి ఆ విధంగా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.