బాక్స్ ఆఫీస్ దగ్గర కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు రెండో వారాన్ని ఇప్పుడు పూర్తీ చేసుకునే పనిలో ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అవ్వగా ఇప్పుడు సినిమా కి 13 వ రోజు రిపబ్లిక్ డే హాలిడే లభించడం బాగానే కలిసి వచ్చింది అని చెప్పాలి. దాంతో సినిమా కలెక్షన్స్ ఒక్కసారిగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించడం విశేషం అని చెప్పాలి. రిపబ్లిక్ డే హాలిడే రోజున ఉన్నంతలో థియేటర్స్ లో చూడటానికి ఉన్న బెటర్ ఆప్షన్ ఈ సినిమానే అవ్వడంతో జనాలు ఉన్నంతలో మరీ విరగబడి రాకున్నా కానీ ప్రీవియస్ డే కన్నా బెటర్ గానే వచ్చారు అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు 26 లక్షల షేర్ ని అందుకుంటే 13 వ రోజు మొత్తం మీద 45 లక్షల రేంజ్ కి వెళ్ళే అవకాశం అలాగే 50 లక్షలకు వెళ్ళే ఔట్ రైట్ ఛాన్స్ ఉందని భావించగా సినిమా ఆ మార్క్ ని అందుకుని 51 లక్షల షేర్ ని 13 వ రోజు సొంతం చేసుకుంది.
దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉందని చెప్పాలి.
👉Nizam: 8.10Cr
👉Ceeded: 6.53Cr
👉UA: 4.96Cr
👉East: 3.97Cr
👉West: 2.79Cr
👉Guntur: 3.32Cr
👉Krishna: 2.16Cr
👉Nellore: 1.69Cr
AP-TG Total:- 33.52CR(54.30Cr~ Gross)
👉Ka+ROI: 1.73Cr
👉OS – 1.45Cr
Total WW: 36.70CR(61.55CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా 13 రోజుల్లో సాధించిన కలెక్షన్స్… సినిమా టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 39 కోట్లు కాగా సినిమా 13 రోజుల తర్వాత క్లీన్ హిట్ కోసం ఇంకా 2.3 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మిగిలిన రన్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేసి ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…