బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ తో లవ్ స్టొరీ అండ్ రిపబ్లిక్ సినిమాలు రెండూ కూడా స్లో డౌన్ అయ్యాయి, లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో క్లీన్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. కానీ రిపబ్లిక్ సినిమా బిజినెస్ లో సగం కూడా వెనక్కి రాబట్ట లేక పోయింది, దాంతో లాస్ ని తగ్గించుకోవడానికి ఈ సినిమా కష్టపడుతుంది.
లవ్ స్టొరీ సినిమా 12 వ రోజు మొత్తం మీద 23 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేయగా 13 వ రోజున ఆల్ మోస్ట్ 25% వరకు డ్రాప్స్ ఎదురు అయినా తిరిగి తేరుకుని కొంచం గ్రోత్ ని చూపెట్టింది. దాంతో సినిమా 13వ రోజు ఇప్పుడు 15-18 లక్షల మధ్యలో షేర్ ని అందుకోవచ్చు.
ఇక రిపబ్లిక్ సినిమా 5వ రోజు 30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 6 వ రోజు ఆల్ మోస్ట్ 30-35% వరకు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో సినిమా ఇప్పుడు 16-18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే 20 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది, మరి రెండు సినిమాల కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.