Home న్యూస్ 2 రోజుల్లో సినిమా రిలీజ్….పట్టించుకోని హీరో!!

2 రోజుల్లో సినిమా రిలీజ్….పట్టించుకోని హీరో!!

3329
0

కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు కొంచం లేట్ అవ్వడం లాంటివి జరగడం కామన్ అని చెప్పాలి. కానీ కొన్ని సినిమాల రిలీజ్ లు చాలా కాలం పోస్ట్ పోన్ అవుతాయి, దాంతో ఆ సినిమా కి పని చేసిన వాళ్ళు లేట్ గా రిలీజ్ అయ్యే టైం లో పెద్దగా పట్టించుకోరు, కానీ హీరో ల విషయంలో ఆ సినిమాలు కీలకం కాబట్టి రిలీజ్ టైం నాటికి అయినా ఆ సినిమా గురించి…

ఒకటి రెండు మాటలు అయినా మాట్లాడుతారు… లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రిలీజ్ కి సిద్దంగా ఉన్న లేట్ అయిన మూవీ ఆరడుగుల బుల్లెట్ సినిమా… ఎప్పుడో 2016 టైం లో షూటింగ్ మొదలు అయ్యి 2017 టైం లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అప్పటి నుండి అనుకోకుండా…

అనేక అవరోధాలను ఎదురుకోవడం వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది… లాస్ట్ ఇయర్ డిజిటల్ రిలీజ్ కోసం ట్రై చేసినా రేట్లు సరిగ్గా రాకపోవడంతో మళ్ళీ ఆగిపోయిన సినిమా ఈ ఇయర్ కూడా కొన్ని రేట్లు వచ్చినా మేకర్స్ నో చెప్పి ఇక లాస్ వస్తే వచ్చంది అని ఇప్పుడు థియేటర్స్ లోనే…

సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. సినిమాను తమ వంతుగా సోషల్ మీడియా లో తెగ ప్రమోట్ చేసే పనిలో ఉన్నప్పటికీ మెయిన్ హీరో అయిన గోపీచంద్ ఇప్పటి వరకు సినిమా పై ఎలాంటి స్పందనని తెలియజేయలేదు. సోషల్ మీడియా లో పెద్దగా యాక్టివ్ గా ఉండని గోపీచంద్ తన లేటెస్ట్ మూవీ సీటిమార్ రిలీజ్ టైం లో ప్రమోషన్స్ కి టైం కేటాయించారు…

కానీ ఎప్పటి నుండో రిలీజ్ కి నోచుకోని ఈ సినిమా పై ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇంట్రెస్ట్ చూపలేదు గోపీచంద్… గోపీచంద్ రెండు మాటలు మాట్లాడితే… సినిమా కి ఎంతో కొంత ప్లస్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మేకర్స్ ఎలాగోలా గోపీచంద్ ని సినిమా ప్రమోషన్స్ కి రప్పిస్తారో లేక హీరో ప్రమేయం లేకుండానే సినిమాను రిలీజ్ చేస్తారో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here