ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసినా తర్వాత స్లో డౌన్ అయినా కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు మెల్లిగా ఒక్కో అడుగు వేస్తున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా రెండో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజులో ఎంటర్ అవ్వగా మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ పరుగును కొనసాగిస్తూ వెళుతూ ఉంది…కాగా సినిమా 13వ రోజున మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకున్నా కూడా…
తిరిగి ఈవినింగ్ షోల నుండి మెల్లిమెల్లిగా జోరు చూపించడం మొదలు పెట్టింది…మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ కనిపిస్తూ ఉండటంతో సినిమా ఓవరాల్ గా 13వ రోజున ఇప్పుడు అటూ ఇటూగా…. 40 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఓవర్సీస్ లో డీసెంట్ నంబర్స్ ని నమోదు చేస్తూ ఉండటంతో ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని 13వ రోజున సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది…
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డీసెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకొంచం కష్టపడాల్సిన అవసరం ఉండగా శని ఆది వారాల్లో డీసెంట్ ట్రెండ్ ను చూపించినా ఫైనల్ రన్ లో క్లీన్ హిట్ గా సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. ఇక టోటల్ గా 13 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.