Home న్యూస్ 13వ సారి 100 కొట్టిన అజయ్ దేవగన్….మాస్ రచ్చ చేశాడుగా!

13వ సారి 100 కొట్టిన అజయ్ దేవగన్….మాస్ రచ్చ చేశాడుగా!

0

బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజయ్ దేవగన్(Ajay Devgn) మంచి ఫామ్ లో దూసుకు పోతున్నాడు….తను నటించిన లేటెస్ట్ మూవీ సైతాన్(Saithaan Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. సినిమా రెండో వీకెండ్ లో కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది..

మొత్తం మీద రెండో వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో సినిమా 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని ఇండియాలో సొంతం చేసుకుని దుమ్ము లేపగా అజయ్ దేవగన్ కెరీర్ లో మరో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. మొత్తం మీద ఈ సినిమా తన కెరీర్ లో ఓవరాల్ గా 13 సారి…

100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది…. ఇది వరకు అజయ్ దేవగన్ కెరీర్ లో గోల్ మాల్3, సింగం, బోల్ బచ్చన్, సన్ ఆఫ్ సర్దార్, సింగం రిటర్న్స్, శివై, గోల్ మాల్ అగైన్, రైడ్, టోటల్ ధమాల్, దే దే ప్యార్ దే, తానాజీ, దృశ్యం2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా….

ఇప్పుడు 13వ సినిమాగా సైతాన్ మూవీ 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది. సూపర్ స్ట్రాంగ్ వీకెండ్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా లాంగ్ రన్ లో అవలీలగా 160కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు. మరి అంతకు మించి సినిమా ముందుకు వెళుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here