Home గాసిప్స్ 14 సార్లు 100 కోట్లు కొట్టిన హీరో…..బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ కన్ఫాం!

14 సార్లు 100 కోట్లు కొట్టిన హీరో…..బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ కన్ఫాం!

0

మన దగ్గర కొందరు స్టార్స్ ఇయర్ కి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటారు కానీ బాలీవుడ్ హీరోల్లో ఖిలాడీ అక్షయ్ కుమార్ రూటే వేరు, ప్రతీ ఇయర్ మినిమమ్ 3 నుండి 4 సినిమాలు చేస్తూ ఎప్పటికప్పుడు ఫుల్ బిజీగా ఉంటూ వస్తాడు అక్షయ్. లాస్ట్ రెండేళ్ళలో ఫస్ట్ వేవ్ సెకెండ్ వేవ్ ల వలన ఇబ్బందులు పడ్డా కానీ కొత్త సినిమాలను కమిట్ అవ్వడం వాటిని ఎలాగోలా పూర్తీ చేసి నిర్మాతలకు..

ఎలాంటి ఇబ్బంది లేకుండా నచ్చితే డైరెక్ట్ రిలీజ్ కి కూడా ఓకే చెబుతూ వస్తున్నాడు అక్షయ్ కుమార్, లాస్ట్ ఇయర్ లక్ష్మీ బాంబ్ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసిస అక్షయ్ కుమార్ ఈ ఇయర్ బెల్ బాటం సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఇలా డైరెక్ట్ రిలీజ్ లను పక్కకు పెడితే…

బాక్స్ ఆఫీస్ దగ్గర అంతకుముందు ఓవరాల్ గా 14 సార్లు 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న అక్షయ్ కుమార్ కొత్త సినిమాల్లో ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ రీమేక్ ని కూడా చేర్చాడు. ఈ సినిమా ఎట్టి పరిస్థితులలో థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలి…

అన్న కండీషన్ తో ఒప్పుకున్నాడు అక్షయ్ కుమార్… ఆ సినిమా మరేదో కాదు తమిళ్ తో పాటు తెలుగు లో కూడా అద్బుతంగా ఆడియన్స్ ను మెప్పించిన సైకో థ్రిల్లర్ మూవీ రాక్షసుడు…. ఆద్యంతం తర్వాత సీన్ ఎం అవుతుందా అన్నన క్యూరియాసిటీ ని ఎండ్ వరకు కొనసాగించిన ఈ ఎపిక్ థ్రిల్లర్ మూవీ హిందీ రీమేక్ లో ఇప్పుడు అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేయబోతున్నాడు.

త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వచ్చే ఇయర్ వస్తుందని అంటున్నారు. తన అప్ కమింగ్ మూవీస్ లైనప్ కూడా అదిరి పోయే విధంగా ఉంది…బెల్ బాటమ్ డిజిటల్ రిలీజ్ తర్వాత సూర్యవంశీ ఫస్ట్ కాపీలు సిద్ధంగా ఉండగా అత్ రంగీరే, రామ్ సేతు, రక్షా బంధన్, పృథ్విరాజ్ తదితరాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడీ రాక్షసుడు రీమేక్ తోడవుతోంది. మరి ఈ సినిమాలతో అక్షయ్ కుమార్ ఏ రేంజ్ లో కుమ్మేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here