దసరా వీకెండ్ వరకు ఎలా ఉన్నా కానీ తర్వాత వర్కింగ్ డేస్ నుండి మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా భారీగా స్లో డౌన్ అవ్వగా రెండో వీకెండ్ లో జోరు అందుకుంటుంది అనుకుంటే కాంతార సినిమా ఫుల్ డామినేట్ చేస్తూ దూసుకు పోతుంది. ఇక వర్కింగ్ డేస్ లో గాడ్ ఫాదర్ సినిమా పరిస్థితి మరింతగా డౌన్ అవుతూ పరుగును మరింతగా కష్టతరం చేసుకుంటూ రన్ ని కొనసాగిస్తుంది ఇప్పుడు.
సినిమా ఇప్పుడు రెండో వారాన్ని కంప్లీట్ చేసుకోబోతుండగా తెలుగు రాష్ట్రాల్లో మరో వర్కింగ్ డే లో మరోసారి 30% రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా, దాంతో ఈ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో…
అటూ ఇటూగా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే ఇంకొంచం కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉండగా ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు 25 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.
మొత్తం మీద సినిమా వర్కింగ్ డేస్ లో ఏమాత్రం హోల్డ్ అయితే చేయడం లేదు అనే చెప్పాలి. మంచి పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఆడియన్స్ భారీ సంఖ్యలో అయితే థియేటర్స్ కి రావడం లేదు. ఇక టోటల్ గా సినిమా 2 వారాల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.