Home న్యూస్ ఇండియన్ సినిమా రికార్డులు చెల్లాచెదురు చేసిన రోబో కి 14 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

ఇండియన్ సినిమా రికార్డులు చెల్లాచెదురు చేసిన రోబో కి 14 ఏళ్ళు…బిజినెస్ అండ్ కలెక్షన్స్ ఇవే!!

0

శంకర్ రజినీ ల కాంబినేషన్ లో ఓ రేంజ్ హైప్ నడుమ తెరకెక్కిన రోబో(14YearsForRobo) సినిమా 14 ఏళ్ల క్రితం అప్పటి టైం కి ఎంతో అడ్వాన్స్ గ్రాఫిక్స్ తో ఇండియన్ స్కీన్ పై అప్పటి వరకు ఎవ్వరూ చూడని అల్టిమేట్ సీన్స్ తో ఓ రేంజ్ లో అంచనాలను ట్రైలర్ తోనే పెంచేసింది, ఆల్ ఇండియా లెవల్ లో అల్టిమేట్ క్రేజ్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచిన ఈ సినిమా….

ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తమిళ్ లో సినిమా పై ఉన్న అంచనాలకు తగ్గ టాక్ రాలేదు, చిన్న పిల్లల సినిమా అన్నారు, అయినా లాంగ్ రన్ లో అక్కడ ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో….

అప్పట్లో స్ట్రైట్ మూవీస్ తప్పితే మరే డబ్బింగ్ మూవీస్ కి దక్కనన్నీ థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా జనాలు విపరీతంగా థియేటర్స్ కి రావడం తో ఎక్స్ ట్రా థియేటర్స్ ని కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. తెలుగు లో ఆ టైం కి టాప్ 2 బిగ్గెస్ట్ షేర్ అందుకున్న సినిమాగా నిలిచింది.

తెలుగు లో ఈ సినిమాను ఆల్ మోస్ట్ 27 కోట్ల రేటుకి కొన్నారు, డబ్బింగ్ మూవీస్ లో ఏ సినిమా ఈ రేంజ్ బిజినెస్ ను చేయలేదు, కానీ రోబో ఆ రేటు కి న్యాయం చేస్తూ తెలుగు రాష్ట్రాలలో 37 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ తో ఆల్ మోస్ట్ 40 కోట్ల షేర్ ని ఆ టైం లో సొంతం చేసుకుని ఊచకోత కోసింది.

ఇక తమిళ్ తెలుగు హిందీ అన్నీ కలిపి సినిమా బిజినెస్ 120 కోట్లు అందుకోగా టోటల్ రన్ లో 292 కోట్ల గ్రాస్ ను 160కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని ఇండియన్ సినిమా రికార్డులను చెల్లాచెదురు చేసి ఊహకందని ఊచకోత కోసింది… ఈ సినిమా షేర్ రికార్డ్ 2013 లో ధూమ్ 3 సినిమా వచ్చే వరకు బాలీవుడ్ వాళ్ళు టచ్ చేయలేక పోయారు. తమిళ్ లో బాహుబలి 2 వచ్చే వరకు ఈ రికార్డ్ అలానే ఉంటూ వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here