బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో ఏప్రిల్ నెలలో 2 పెద్ద పాన్ ఇండియా మూవీస్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. వచ్చిన తర్వాత ఆడియన్స్ ను అలరించడంలో ఓ రేంజ్ లో విఫలం అయ్యి లాస్ పరంగా ఎపిక్ మైండ్ బ్లాంక్ అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు. ఒక్క నెల లోపే ఆల్ మోస్ట్ 2 వారాల గ్యాప్ లో రిలీజ్ అయిన ఈ రెండు పాన్ ఇండియా మూవీస్….
భారీ నష్టాలను సొంతం చేసుకుంది ఇప్పుడు. శాకుంతలం సినిమా ఆల్ మోస్ట్ 65 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కగా ఏజెంట్ మూవీ ఆల్ మోస్ట్ 85 కోట్ల బడ్జెట్ తో వచ్చింది. రెండు సినిమాలు కలిపి ఆల్ మోస్ట్ 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా రెండు సినిమాల కలెక్షన్స్ చూస్తె…
శాకుంతలం సినిమా టోటల్ గా 4.32 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఏజెంట్ మూవీ టోటల్ రన్ లో 6.90 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని పరుగు ను పూర్తీ చేసుకుంది. రెండు సినిమాల టోటల్ షేర్ 11.22 కోట్ల దాకా ఉండగా బడ్జెట్ పరంగా చూసుకుంటే రెండు సినిమాలు కలిపి టోటల్ గా…
10% కూడా రికవరీ ని ఈ సినిమాలు సొంతం చేసుకోలేదు…. బడ్జెట్ పరంగా రెండు సినిమాలు కలిపి నష్టం 138 కోట్ల రేంజ్ లో నష్టాన్ని సొంతం చేసుకుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ తో మేజర్ అమౌంట్ సేఫ్ అయినా కూడా ఏ సినిమాల ద్వారా నిర్మాతలు బయ్యర్లు ఇద్దరూ కూడా నష్టపోయారనే చెప్పాలి.