Home గాసిప్స్ 91 కోట్ల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా…నిజమైతే కుమ్ముడే!

91 కోట్ల బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అఖిల్ సినిమా…నిజమైతే కుమ్ముడే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఓ భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఒకరు….మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టినా కూడా ఆ తర్వాత తన కెరీర్ లోనే ఆల్ టైం…

హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ అయిన ఏజెంట్(Agent Movie) అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ఎఫెక్ట్ వలన అఖిల్ అప్ కమింగ్ మూవీ ని ఏది కూడా ఇప్పటి వరకు కన్ఫాం చేయలేదు, కొన్ని ప్రాజెక్ట్ లు అనుకున్నా కూడా ఏవి కూడా ఇప్పటి వరకు ఓకే కాలేదు…

ఇలాంటి టైంలో లాస్ట్ ఇయర్ సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ తో అఖిల్ సినిమా ఉండే అవకాశం ఉందని స్ట్రాంగ్ గా బజ్ ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది…. 2023 సమ్మర్ లో వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న సాయి ధరం తేజ్(Sai Dharam Tej) కి…

విరూపాక్ష(Virupaksha) మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కార్తిక్ దండు తన తర్వాత సినిమాను ఏమి కమిట్ అవ్వలేదు… టోటల్ రన్ లో 91 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుని భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన ఆ సినిమా డైరెక్టర్ రీసెంట్ గా అఖిల్ కి ఒక స్టోరీ వినిపించారని ఇండస్ట్రీ లో టాక్ ఉండగా…

ఆ స్టోరీ పాయింట్ అఖిల్ కి బాగానే నచ్చింది అంటున్నారు… విరూపాక్ష లానే ఆ సినిమా కూడా డిఫెరెంట్ స్టోరీ పాయింట్ తో ఉంటుందని అంటున్నారు… మరి ఈ సినిమా కనుక కన్ఫాం అయ్యి అఖిల్ కి ఓ భారీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందా లేక అఖిల్ ఇంకా ఎవరైనా డైరెక్టర్ తో సినిమా ఓకే చేస్తారో త్వరలో తేలుతుంది…


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here