Home న్యూస్ ఏడాది అయిపోయింది….ఈ సినిమాలకు మోక్షం కలగలేదు!

ఏడాది అయిపోయింది….ఈ సినిమాలకు మోక్షం కలగలేదు!

0

దాదాపుగా ప్రస్తుతం అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ కంప్లీట్ చేసుకున్న వెంటనే డిజిటల్ లో రిలీజ్ అవ్వడం తర్వాత కొంత గ్యాప్ కి టెలివిజన్ లో రిలీజ్ అవ్వడం మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాం, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప దాదాపు అన్ని సినిమాలు కూడా డిజిటల్ లో టెలివిజన్ లో రెగ్యులర్ గా రిలీజ్ అవుతూనే ఉన్నాయి…

కానీ లాస్ట్ ఇయర్ ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్ లో ఓ మూడు పెద్ద సినిమాలు మాత్రం థియేటర్స్ లో రిలీజ్ అయినా కూడా డిజిటల్ లో కానీ తర్వాత టెలివిజన్ లో కానీ రిలీజ్ ను సొంతం చేసుకోలేక పోయాయి…చాలా టైం తీసుకుంటూ రాగా ఇప్పుడు ఏకంగా ఈ సినిమాలు అన్నీ వచ్చి ఏడాది టైం కావోస్తూ ఉండటం విశేషం.

అయినా కూడా ఈ సినిమాలు ఇప్పటి వరకు డిజిటల్ లో రిలీజ్ కి నోచుకోలేదు.. ఈ లిస్టులో టాలీవుడ్ నుండి అఖిల్ అక్కినేని(Akhil Akkineni) నటించిన ఏజెంట్(Agent Movie) ఎప్పటి కప్పుడు డిజిటల్ రిలీజ్ ను అనౌన్స్ చేసి తర్వాత పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు. ఇక బాలీవుడ్ నుండి 2 సినిమాలు ఉన్నాయి…

ఒకటి సైలెంట్ గా వచ్చి ‘తేరీ వాస్తే ఫలక్ సే మే చాంద్ లావుంగా’ సాంగ్ తో ఫుల్ పాపులర్ అయిన జర హట్కే జర ఫట్కే సినిమా….బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలిచిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు డిజిటల్ లో రిలీజ్ కి నోచుకోలేదు….

ఇక టైగర్ ష్రాఫ్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గణపత్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా యాక్షన్ సీన్స్ బాగున్నాయి అని పేరు వచ్చింది కానీ డిజిటల్ లో మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేదు. కారణాలు ఏవైనా ఇలా పేరున్న మూవీస్ కే డిజిటల్ లో రిలీజ్ కి ఇలా టైం ఎక్కువ అవ్వడం అందరినీ ఆశ్యర్యపరిచింది అని చెప్పాలి. మరి త్వరలో అయినా ఈ సినిమాలు డిజిటల్ లో టెలివిజన్ లో రిలీజ్ అవుతాయో లేవో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here