రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 19 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 313 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1546 కోట్ల రేంజ్ లో…
మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసిన సినిమా 20వ రోజున మరో వర్కింగ్ డే లో ఎంటర్ అయినా కూడా టికెట్ సేల్స్ లో 19వ రోజు మీద మంచి ట్రెండ్ ను చూపించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా 1.5-1.7 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఇక హిందీలో మరింత రచ్చ చేస్తున్న సినిమా ఈ రోజు అక్కడా…
14.5-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు ఇతర రోజుల మాదిరిగా ఉంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో ట్యూస్ డే ఆఫర్స్ తో మరోసారి మంచి జోరు చూపిస్తున్న నేపధ్యంలో సినిమా…
అన్నీ కలిపి సినిమా ఇప్పుడు 20వ రోజున 22-23 కోట్ల రేంజ్ లో గ్రాస్‌ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే గ్రాస్ మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 315 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…
సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 1568-1570 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా మొత్తం మీద 20 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…