Home న్యూస్ ఇంకా 15 పైనే కావాలి….ఛాన్స్ ఉందా….లేదా!!

ఇంకా 15 పైనే కావాలి….ఛాన్స్ ఉందా….లేదా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ సలార్(Salaar Movie) మూడో వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా మొత్తం మీద 20 రోజులు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సలార్ మూవీ 331.63 కోట్ల దాకా షేర్ ని అందుకున్న సినిమా 618.85 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ వసూళ్ళని దక్కించుకున్న సినిమా 347 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే ఇంకా 15.37 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ ఈ నెల 12 నుండి సంక్రాంతి సినిమాల రిలీజ్ లు గ్రాండ్ గా ఉండటంతో…

Salaar 18 Days Total WW Collections!

సలార్ మూవీ ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది అని చెప్పాలి. మిగిలిన చోట్ల ఒక్క హిందీ లో తప్పితే సినిమా అన్ని చోట్లా రన్ ఆల్ మోస్ట్ ఎండ్ అయ్యింది అనే చెప్పాలి. కానీ సినిమా మొత్తం మీద 20 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 96% లోపు రికవరీని బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సొంతం చేసుకోగా….

ఇంకా బాలెన్స్ 15 కోట్లకు పైగానే రావాల్సిన అవసరం ఎంతైనా ఉండగా ఇక సినిమా తేరుకుని మిగిలిన అమౌంట్ ని అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. హిందీలో మేజర్ గా ఇక కలెక్షన్స్ రానుండగా అవి ఎంత వచ్చిన ఇక బిజినెస్ మార్క్ ని సినిమా అందుకునే అవకాశం తక్కువే, దాంతో సినిమా ఫైనల్ రన్ లో సెమీ హిట్ గా పరుగును పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

Salaar 20 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here