బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ లో రిలీజ్ అయిన కాంతార సినిమాను కేజిఎఫ్ నిర్మాతలు హంబాలే ప్రొడక్షన్ వాళ్ళు నిర్మించగా సినిమా కర్ణాటకలో ఫస్ట్ డే 2.35 కోట్ల గ్రాస్ ను అందుకుంటే తెలుగు లో ఫస్ట్ డే ఆల్ మోస్ట్ 4 కోట్లకు దగ్గరగా గ్రాస్ ను అందుకుంది. తెలుగు లో 2 వారాల తర్వాత రిలీజ్ అయినా ఊహకందని స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన 16 రోజుల్లో ఓవరాల్ గా ఇప్పుడు….
100 కోట్ల గ్రాస్ మార్క్ ని ఇండియా లో సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 110 కోట్ల గ్రాస్ మార్క్ ని కంప్లీట్ చేసుకుంది, కర్ణాటకలో మొదటి వారం కన్నా కూడా రెండో వారం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా…
మొత్తం మీద 15 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే తెరకెక్కగా ఇప్పుడు ఆల్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. 17 వ రోజు కలెక్షన్స్ తో సినిమా 120 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోబోతుండగా ఫైనల్ రన్ లో ఈ సినిమా…
150 కోట్ల రేంజ్ కి చేరుకున్నా అంతకన్నా మించి ముందుకు పోయినా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం. తెలుగు లో కూడా ఈ సినిమా బాక్స్ అఫీస్ దగ్గర దీపావళి సినిమాలు వచ్చే వరకు జోరు కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది.