Home న్యూస్ కాంతార చాప్టర్1 టీసర్ రివ్యూ….బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం!!

కాంతార చాప్టర్1 టీసర్ రివ్యూ….బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుని ఊచకోత కోసిన సినిమాల్లో కాంతార(Kantara Movie), అన్ని ఇండస్ట్రీలలో ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ విజయాన్ని కొనసాగించడానికి సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ని అనౌన్స్ చేయగా….

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు, కాంతార చాప్టర్1 అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ చూసిన తర్వాత ఈ పార్ట్ 2 భారీ కలెక్షన్స్ తో రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు ఇప్పుడు….

ప్రజెంట్ మీరు చూసింది కాంతార పార్ట్ 2 అని, పార్ట్ 1 ఈ కథ ఎలా స్టార్ట్ అయింది, అన్న కాన్సెప్ట్ తో రూపొందుతున్న కాంతార చాప్టర్1 సినిమా క్వాలిటీ పరంగా టేకింగ్ పరంగా, విజువల్స్ పరంగా బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా అదుర్స్ అనిపించేలా ఉందని చెప్పాలి….

డైరెక్టర్ కం హీరో అయిన రిషబ్ శెట్టి ఈ సినిమాతో మరోసారి అద్బుతం సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కట్ తో వచ్చిన కాంతార చాప్టర్1 టీసర్ ఎప్పుడు వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం, ఇక టీసర్ 24 గంటల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here