బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో 2 వారాలను పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసిన యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా మూడో వారంలో అడుగు పెట్టగా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది…
ఇక మూడో వీక్ లో కొత్త సినిమాలు ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ ని హోల్డ్ చేసిన తండేల్ మూవీ శుక్రవారం పోటి లో కూడా లిమిటెడ్ డ్రాప్స్ తోనే పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…. మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో…
14వ రోజుతో పోల్చితే 15వ రోజు బుకింగ్స్ ట్రెండ్ లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ కూడా స్లైట్ గ్రోత్ ని చూపెడుతూ ఉండటంతో సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు 15వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 14వ రోజు కి సిమిలర్ గా..
షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కొంచం అంచనాలను మించిపోతే సినిమా 32-35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో మాత్రం సినిమా స్లో డౌన్ అవ్వడంతో అక్కడ నుండి పెద్దగా షేర్…
సొంతం అయ్యే అవకాశం అయితే తక్కువగానే కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా గ్రాస్ పరంగా 70-75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా, శని ఆదివారాల్లో సినిమా మళ్ళీ జోరు చూపించే అవకాశం ఉంది. ఇక టోటల్ గా సినిమా 15 రోజుల్లో సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.