Home న్యూస్ రవితేజ అల్టిమేట్ కామెడీ హిట్ కిక్ కి 15 ఏళ్ళు….బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

రవితేజ అల్టిమేట్ కామెడీ హిట్ కిక్ కి 15 ఏళ్ళు….బిజినెస్ అండ్ టోటల్ కలెక్షన్స్ ఇవే!

0

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో టాప్ మూవీస్ లో నిలిచే సినిమాల్లో కిక్(Kick Telugu Movie) ఒకటి….బెస్ట్ కమర్షియల్ మూవీస్ లో ఒకటి అని చెప్పొచ్చు…కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, హీరోయిజం…సెంటిమెంట్ ఇలా అన్ని ఎలిమెంట్స్ పెర్ఫెక్ట్ గా సెట్ అయిన అతి కొద్ది కమర్షియల్ మూవీస్ లో కిక్ సినిమా ఒకటి…

2009 టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ లో మగధీర(Magadheera) అరుంధతి(Arundhathi Movie) ల తర్వాత మూడో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. రవితేజ కెరీర్ లో 25వ సినిమాగా వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో 25వ సినిమాల పరంగా బెస్ట్ మూవీగా నిలిచిన సినిమా ఇది….

ఫ్లాఫ్స్ తో ఉన్న టైంలో బరిలోకి పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కిక్ మూవీ అల్టిమేట్ మౌత్ టాక్ తో సమ్మర్ లో ఊహకందని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుని 2009 టైం సమ్మర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి ఇప్పుడు 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం విశేషం…

ఆ టైంలో ఈ సినిమా కి 12.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. లాంగ్ రన్ లో ఈ సినిమా 25.60 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది… బిజినెస్ మీద ఆల్ మోస్ట్ 13 కోట్లకు పైగా లాభాన్ని అందుకుంది. ఈ సినిమా అల్టిమేట్ హిట్ తర్వాత రవితేజ సినిమాల మీద…

క్రేజ్ భారీగా పెరిగిపోయింది. కానీ తర్వాత టైంలో ఈ సినిమా మరిపించే రేంజ్ కంప్లీట్ పక్కా కమర్షియల్ మూవీ రవితేజకి పడలేదు, మధ్యలో క్రాక్ లాంటి మాస్ మూవీ, ధమాకా లాంటి కమర్షియల్ హిట్స్ పడ్డాయి కానీ రవితేజ నుండి ఇప్పటికీ ఆడియన్స్ కిక్ రేంజ్ మూవీని ఎక్స్ పెర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రజెంట్ పెరిగిన మార్కెట్ లో ఈ సినిమా కనుక…

రిలీజ్ అయ్యి ఉంటే అవలీలగా 80-100 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే రేంజ్ మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమా… అలాంటి సినిమా వచ్చి 15 ఏళ్ళు కంప్లీట్ అవ్వగా రవితేజ తన అప్ కమింగ్ మూవీస్ లో తిరిగి మళ్ళీ కిక్ రేంజ్ సక్సెస్ ను ఏ సినిమాతో సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here