Home న్యూస్ మాస్ మూవీ దెబ్బకి అరిగిపోయిన హర్రర్ కామెడీ ఆయింట్ మెంట్…ఇది ఊహించలేదు ఎవ్వరూ!

మాస్ మూవీ దెబ్బకి అరిగిపోయిన హర్రర్ కామెడీ ఆయింట్ మెంట్…ఇది ఊహించలేదు ఎవ్వరూ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ సీజన్ చాలా చప్పగా సాగగా టాలీవుడ్ అయినా సంక్రాంతికి ఓ భారీ బ్లాక్ బస్టర్ సమ్మర్ లో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది, మళయాళ ఇండస్ట్రీ వరుస బ్లాక్ బస్టర్స్ తో దుమ్ము లేపింది….కానీ కోలివుడ్ ఇండస్ట్రీ మాత్రం ఇయర్ స్టార్టింగ్ నుండి అనుకున్న రేంజ్ లో హిట్ ని అయితే అందుకోలేక పోయింది…

సంక్రాంతి సినిమాలు నిరాశ పరచడం, తర్వాత వచ్చిన మూవీస్ లో మలయాళ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ అలాగే గిల్లి రీ రిలీజ్ లు కొంత ఊరట ఇచ్చినా కొత్త సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేదు…ఇలాంటి టైంలో లాస్ట్ ఇయర్ మార్క్ ఆంటోని మూవీతో 100 కోట్లు కొట్టిన హీరో విశాల్(Vishal) మరియు…

డైరెక్టర్ హరిల కాంబోలో వచ్చిన రత్నం(Rathnam Movie) అనే మాస్ మూవీ తిరిగి జనాలను భారీ లెవల్ లో థియేటర్స్ కి రప్పిస్తుంది అని అనిపించినా ఆ సినిమా మొదటి ఆట నుండే నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుని భారీ నష్టాలను సొంతం చేసుకోగా ఆ సినిమా దెబ్బకి ఇప్పుడు ఆల్ రెడీ అరిగిపోయిన హర్రర్ కామెడీ మూవీ అయిన….

అరణ్మనై4(Aranmanai4 Movie) సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం, సినిమా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తుంది. దాంతో రత్నం సినిమా కొడుతుంది అనుకుంటే ఆ సినిమా కొట్టిన దెబ్బకి ఇప్పుడు అరణ్మనై4 సినిమా ఆయింట్ మెంట్ రాస్తూ….

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ లాంగ్ రన్ దిశగా అడుగులు వేస్తుంది….ఆ మాస్ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది అనుకున్నా అరిగిపోయిన హర్రర్ కామెడీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం. ఇక అప్ కమింగ్ టైంలో కోలివుడ్ లో సాలిడ్ హిట్స్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here