బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) కొత్త సినిమాల నుండి పోటిని ఎదురుకోగా ఉన్నంతలో మరోసారి మంచి హోల్డ్ నే చూపెడుతూ దూసుకు పోతుంది ఇప్పుడు…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 15వ రోజు మంచి హోల్డ్ ని చూపించగా…
16వ రోజు వీకెండ్ స్టార్ట్ అయినా కూడా కొత్త సినిమాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ నే చూపెడుతున్న సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆల్ మోస్ట్ 15 వ రోజు లెవల్ లో ట్రెండ్ అవుతూ ఉండగా సినిమా మొత్తం మీద మరోసారి 80 లక్షలకు అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది.
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉంది, ఇక సినిమా హిందీలో ఈ రోజు కొత్త రిలీజ్ ల వలన కొంచం ఇంపాక్ట్ ఉండగా 3-3.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా…
ఇప్పుడు 50-60 లక్షల షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కోటి కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా మొత్తం మీద సినిమా 16వ రోజున వరల్డ్ వైడ్ గా 3.6-4 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
మొత్తం మీద మరోసారి సినిమా డీసెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక మొత్తం మీద 16 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…