బాక్స్ ఆఫీస్ దగ్గర వారం వారం వచ్చే కొత్త సినిమాలను ఫుల్లుగా డామినేట్ చేస్తూ మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) మూడో వారంలో కొత్త సినిమాలు చాలానే రిలీజ్ అయినా కూడా అన్ని సినిమాలను…
డామినేట్ చేస్తూ ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే హిందీ లో మేజర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోబోతున్న సినిమా మిగిలిన చోట్ల ఆయా భాషల్లో రిలీజ్ అయిన మూవీస్ వలన షోల కౌంట్ భారీగా తగ్గింది…
మొత్తం మీద టికెట్ బుకింగ్స్ పరంగా 15వ రోజు సిమిలర్ గా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకోగా ఉన్నంతలో ఈ రోజు 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక సినిమా హిందీ లో ఈ రోజు మరోసారి మంచి జోరునే చూపెడుతూ ఉండగా 13-14 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఇక …
కర్ణాటక తమిళ్ అండ్ కేరళ కలిపి షేర్ అటూ ఇటూగా 50 లక్షల లోపే ఉండే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో కూడా పర్వాలేదు అనిపిస్తున్న సినిమా ఓవరాల్ గా 16వ రోజున వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 9 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగి 9.5-10 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. మేజర్ కలెక్షన్స్ హిందీ నుండే వస్తూ ఉండగా, కొత్త సినిమాల పోటి ఉన్నప్పటికీ తెలుగులో సినిమా బెస్ట్ ఆప్షన్ గా నిలిచింది ఆడియన్స్ కి. ఇక సినిమా 16 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.